• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MADHYA PRADESH MINISTER PREM SINGH PATEL CONTROVERSIAL COMMENTS OVER CORONA DEATHS AK

Covid-19 Deaths: కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Covid-19 Deaths: కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

Covid-19 Deaths: కరోనా మరణాలపై మధ్యప్రదేశ్‌కు చెందిన మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రళయం సృష్టిస్తోంది. కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేయడంతో పాటు కరోనా మరణాలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా మరణాలపై మధ్యప్రదేశ్‌కు చెందిన మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వయసు మీద పడితే మరణిస్తారని మంత్రి ప్రేమ్‌సింగ్ పటేల్ అన్నారు. దీన్ని ఎవ‌రూ అడ్డుకోలేమ‌ని తెలిపారు. క‌రోనా మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలు మాస్క్‌లు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పటేల్ సూచించారు. మధ్యప్రదేశ్‌లో కరోనా మరణాలపై ప్రశ్నించడంతో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.

    ఇదిలా ఉంటే దేశంలో రోజుకో కొత్త రికార్డుతో బెంబేలెత్తిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. గడచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాల సంఖ్య 1038గా నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య1.40 కోట్లను దాటేసింది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,73,123కి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరింత విజృంభిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,307 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నిన్న ఎనిమిది మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,788కి చేరింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు