నిక్కరు సైజు సరిచేసి ఇవ్వలేదని.. ఓ వ్యక్తి ఏం చేశాడంటే..?

ప్రతీకాత్మక చిత్రం

టైలరు నిక్కర్ అతడికి సరిపడా సైజులో కుట్టించి ఇవ్వలేదు. నిక్కరును తన సైజుకు సరి చేసి ఇవ్వాలని కోరినా.. టైలరు పట్టించుకోలేదు. దీంతో దుబేకు చిర్రెత్తుకొచ్చింది.

 • Share this:
  కొంతమంది చిన్నచిన్న విషయాలకే పోలీసు స్టేషన్ గడప తొక్కడం చేస్తుంటారు. కోడి పోయిందని ఒకరు.. పెంపుడు చిలుక తిడుతుందని మరొకరు.. పోలీసులను ఆశ్రయించడం గతంలో చూశాం. అయితే తాజాగా ఓ వ్యక్తి తన నిక్కరు సైజును సరిచేయడం లేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. టైలర్‌పై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలంటూ పట్టుబట్టాడు. దీంతో ఏం చేయలేక పోలీసులు కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరుకావాలంటూ సదరు టైలర్‌కు సూచించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని బోఫాల్‌కు చెందిన కృష్ణకుమార్ దుబె(46) ఓ కొత్త నిక్కర్ కుట్టించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం రెండు మీటర్ల క్లాత్ కోనుగోలు చేశాడు. స్థానికంగా ఉండే ఓ టైలర్ దగ్గరకు వెళ్లి నిక్కర్ కుట్టమనిఇచ్చాడు.

  అందుకోసం టైలర్‌కు రూ.70 చెల్లించాడు. అయితే ఆ టైలరు నిక్కర్ అతడికి సరిపడా సైజులో కుట్టించి ఇవ్వలేదు. నిక్కరును తన సైజుకు సరి చేసి ఇవ్వాలని కోరినా.. టైలరు పట్టించుకోలేదు. దీంతో దుబేకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి సదరు టైలరుపై ఫిర్యాదు చేశారు. మొదట ఆ స్టేషన్‌లోని సిబ్బంది కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ అనంతరం దుబే చెప్పింది విని టైలర్‌పై కేసు నమోదు చేశారు.

  లాక్‌డౌన్ నేపథ్యంలో చేతిలో సరిపడా డబ్బుల్లేక రెండు పూటలా తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడుతుంటే.. టైలరు చేసిన నిర్వాకం వల్ల మరింతగా ఇబ్బందులు పడ్డానని, తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో దుబే కంప్లైంట్‌ను స్వీకరించడంతో పాటు టైలరును కోర్టుకు హాజరుకావాలంటూ పోలీసులు సూచించారు.
  Published by:Narsimha Badhini
  First published: