సింధియా ఎఫెక్ట్.. కమల్‌నాథ్ సర్కారు బలపరీక్ష నేడే..

దేశ రాజకీయాలను ఆసక్తిగా మార్చేసిన మధ్యప్రదేశ్ రాజకీయం కీలక దశకు చేరుకుంది. ఈ రోజు కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీలో బలం నిరూపించుకోనుంది.

news18-telugu
Updated: March 16, 2020, 6:54 AM IST
సింధియా ఎఫెక్ట్.. కమల్‌నాథ్ సర్కారు బలపరీక్ష నేడే..
కమల్‌నాథ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
దేశ రాజకీయాలను ఆసక్తిగా మార్చేసిన మధ్యప్రదేశ్ రాజకీయం కీలక దశకు చేరుకుంది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకోవడం, తనతో పాటు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకుపోవడానికి సిద్ధం కావడంతో కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ స్పీకర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ గవర్నర్‌ను కలిసి.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే కమల్‌నాథ్ ప్రభుత్వంతో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ఫలితంగా ప్రభుత్వాన్ని నడిపే హక్కు కోల్పోయిందని ఈ సందర్భంగా చౌహాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు లేదని అన్నారు.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ స్పీకర్‌ను బల పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. దానికి ఈ రోజే ముహూర్తం నిర్ణయించారు కూడా. ఈ రోజు కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీలో బలం నిరూపించుకోనుంది. ఈ బలపరీక్షలో నెగ్గితేనే కమల్‌నాథ్ సీఎంగా కొనసాగుతారు. లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 16, 2020, 6:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading