ఇది శీతాకాలం (Winter). ఈ సీజన్‌లో వేడి నీళ్లు (Hot Water) లేనిదే స్నానం చేయలేం. నీరు అంత చల్లగా ఉంటాయి. అందుకే మనలో చాలా మంది స్టవ్‌పై వేడి నీళ్లు కాచుకుంటారు. లేదంటే గీజర్ పెట్టుకుంటారు. హీటర్‌తో నీటిని వేడి చేసుకుంటారు. ఆ తర్వాత స్నానం చేస్తారు. కానీ ఇలాంటివేమీ లేకుండానే.. ఓ బావిలో నీళ్లు వేడిగా (Hot water Well) ఉంటాయి. ఏడాది పొడవునా ఆ బావిలో వేడి నీళ్లే ఉంటాయి. చలికాలంలో చుట్టూ శీతల వాతావరణం ఉన్నా.. అందులోని నీళ్లు మాత్రం చల్లబడవు. చాలా వెచ్చగా ఉంటాయి. శీతాకాలంలో చాలా మంది ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తుంటారు. స్థానికులే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని మండ్లా జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలో జబల్ రహదారిపై ఉన్న బబైహా అనే గ్రామం ఉంటుంది. నర్మదా నది ఒడ్డున ఉండే.. ఈ గ్రామంలోనే వేడి నీటి బావి ఉంది. ఇక్కడి ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చని పొలాలు.. భారీ వృక్షాలు.. నదులు.. జలపాతాలతో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. ఈ బావిలో ఉండే నీరు శతబ్ధాలుగా వేడిగా ఉంటోంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయట. ఇందులో స్నానం చేస్తే.. చర్మ వ్యాధులు దూరమవుతాయని స్థానికులు చెబుతున్నారు. అందువల్ల సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చి.. బావిలో స్నానం చేస్తుంటారు. దీనికి ఉండే ప్రత్యేకతల వల్ల.. ఈ వేడినీటి బావి పిక్నిక్ స్పాట్‌గా మారింది.
Telangana News: పులితో సెల్ఫీ కావాలా..? సఫారీతో లక్కీ ఛాన్స్.. ఖర్చు ఎంతంటే..!
అసలు ఈ బావిలోని నీరు ఎందుకు వేడిగా ఉంటుందో తెలుసా.? బావి దిగువన పెద్ద మొత్తంలో సల్ఫర్ ఉందని.. అందుకే ఇందులోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సల్ఫర్ నీటిని వేడిగా ఉంచడమే కాకుండా.. అందులోని ఔషధ గుణాలు చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తాయి. ఇది అక్కడి వారసత్వ సంపదే కాదు..పర్యాటకంగానూ ఎంతో ప్రాముఖ్యత కలిగినది. కానీ, పాలనాపరమైన నిర్లక్ష్యం కారణంగా ఈ సరస్సు దుస్థితికి చేరుకుంటోంది. దీని సంరక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇక్కడ సరైన పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు కూడా లేవు
ఒకప్పుడు ఈ బావి కలుషితం కాకుండా స్థానికులు కాపాడుకునే వారు. కానీ పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడంతో వారూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. సబ్బు, షాంపూ రాసుకొని స్నానాలు చేయడంతో నీరు కలుషితమవుతోంది. గతంలో ఉన్నంత తేటగా..స్వచ్ఛంగా.. నీళ్లు ఉండడం లేదు. ఇక్కడికొచ్చే పర్యాటకులు ఇందులో సబ్బు, షాంపూలు వాడకుండా నిషేధం విధించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు దృష్టించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Madhya pradesh