ఆవు పేడతో గ్రామీణ భారతానికి విడదీయరాని బంధం ఉంది. ఉదయం లేచిన వెంటనే కల్లాపి చల్లింది మొదలు.. రాత్రి పడుకునే ముందు పిడకలతో పొగ వరకు.. అనేక చోట్ల పేడ ఉత్పత్తులను వాడుతారు. అంతేకాదు పశువుల పేడ రైతులకు మంచి ఎరువుగానూ ఉపయోగపడుతోంది. అందుకే ఆవు పేడ విషయంలో పలు ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను తీసుకొస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడ, గోమూత్రంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని.. వీటిని సద్వినియోగం చేసుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని చౌహాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి ఆవు పేడ కొనాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఏటా ‘ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్’ జరిపే మహిళా పశువైద్యుల సదస్సు ‘శక్తి 2021’ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆవు పేడ, మూత్రం వినియోగానికి సరైన వ్యవస్థను తీసుకురాగలిగితే అది మన ఆర్థిక వ్యవస్థకు మరింత బలపడుతుందని ఆయన అన్నారు.
ఆవు పేడ రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు..! ఎక్కడో తెలుసా..?
#WATCH | Cows, their dung and urine can help strengthen the economy of the state and the country if a proper system is put in place," says Madhya Pradesh CM Shivraj Singh Chouhan while addressing a convention of the women’s wing of Indian Veterinary Association in Bhopal pic.twitter.com/Mf2yvmYsf0
— ANI (@ANI) November 13, 2021
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆవు పేడను కొనే యోచనలో ఉన్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. వాటి నుంచి ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తులు తయారు చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆవు పేడ, గో మూత్రంతో క్రిమిసంహారిణిలు, ఔషధాలు సహా ఇతర ఉత్పత్తులను తయారు చేయొచ్చని.. వీటిని చక్కగా ఉపయోగించుకుంటే గ్రామీణ కుటుంబాలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ శ్మశాన వాటికల్లో శవాల దహనానికి కలపకు బదులు.. పిడకలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం గోశాలల్ని, సంరక్షణా కేంద్రాలను నెలకొల్పిందని చెప్పుకొచ్చారు శివరాజ్ సింగ్. పశుసంరక్షణ, చికిత్స నిమిత్తం ‘109’ నంబర్‌పై ప్రత్యేక అంబులెన్స్ సర్వీసులను కూడా ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు.
కాసేపట్లో పెళ్లి.. బరాత్‌లో మందుకొట్టి చిందేసిన వరుడు.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
కాగా, ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం 2020లో గోధాన్ నయా యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రకారం ప్రభుత్వమే.. రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కిలో 2 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇలా గ్రామాల నుంచి ఆవుపేడను సేకరిస్తోంది. సేకరించిన పేడను సహకార సంఘాల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి రైతులకు విక్రయిస్తుంది. ఇందుకోసం సహకార సంఘాలకు రుణాలు కూడా ఇస్తుంది. దీంతో ఛత్తీస్‌ఘడ్‌లో ఆవు పేడకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అక్కడ ఆవు పేడ విలువైన వస్తువుగా మారిపోయింది. ఆవు పేడ కోసం దొంగతనం చేసే స్థితి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.