ఇది విన్నారా... త్వరలో మహిళల కోసం ప్రత్యేక లిక్కర్ షాపులు...

Women Friendly Liquor Shops : ఇండియా చాలా మారింది. ఇక్కడ చాలా మంది మహిళలు కూడా లిక్కర్ తాగుతున్నారు అని భావించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక లిక్కర్ షాపులు తెరవబోతోంది.

news18-telugu
Updated: February 29, 2020, 10:23 AM IST
ఇది విన్నారా... త్వరలో మహిళల కోసం ప్రత్యేక లిక్కర్ షాపులు...
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చీప్ లిక్కర్ ధరలను తగ్గించింది. ఆ మేర కాస్ట్ లీ బ్రాండ్ల ధరలు పెంచింది.
  • Share this:
Women Friendly Liquor Shops : మద్యపాన నిషేధం... ఓ 20 ఏళ్ల కిందట ఈ పదం వినపడగానే... మహిళలు చీపుర్లు, కర్రలు పట్టుకొచ్చి... రోడ్లపై ఆందోళనలు చేసి... లిక్కర్ షాపులు, బెల్టు షాపులపై అపర కాళికల్లా విరుచుకుపడి... మద్యం బాటిళ్లను పగలగొట్టే సీన్లు కనిపించేవి. మరి ఇప్పుడో... మద్యపాన నిషేధం అనే పదమే చరిత్రలో కొట్టుకుపోతోంది. చాలా ఇళ్లలో మహిళలు కూడా మద్యాన్ని తాగేస్తున్నారు. భర్తకు ఉండే ఆ అలవాటును మాన్పించడం మానేసి... తామూ అలవాటు చేసుకొని... కంపెనీ ఇస్తున్నారు. అంతే కాదు... మద్యం తాగడం అనేది ఓ స్టేటస్ సింబల్‌లా భావిస్తున్నారు చాలా మంది. ఫలితంగా మద్యం షాపుల్లో పచ్చ నోట్లు గలగలలాడుతుంటే... ప్రజల ఆరోగ్యాలకు చిల్లులు పడి... ఆస్పత్రుల్లో బిల్లులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులకు మరింత ఆజ్యం పోసేలా నిర్ణయం తీసుకుంది మధ్యప్రదేశ్... కమలనాథ్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. త్వరలో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా ఫ్రెండ్లీ మద్యం షాపులు తెరవబోతోంది. ఈ షాపుల్లో మహిళలు ఎక్కువగా తాగే... వైన్, విస్కీ బ్రాండ్లను అమ్ముతారట. ఐతే... ఈ షాపులు రోడ్లపై ఉండవు. పెద్ద పెద్ద మాల్స్‌లో, మార్కెట్ ప్లేసెస్‌లో ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే చాలా క్లాస్‌గా, హైఎండ్ లుక్‌తో, స్టైలుగా ఉంటాయి. ముందుగా ఇలాంటి రెండేసి షాపుల్ని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌, మరో నగరం ఇండోర్‌లో ప్రారంభించబోతోంది. అలాగే... జబల్పూర్, గ్వాలియర్‌లో ఒక్కో షాపును తెరవబోతోంది.

ఇక ప్రధాన పట్టణాల్లో... విదేశీ మద్యాన్ని అమ్మేందుకు ప్రత్యేక అవుట్‌లెట్లను కూడా తెరవబోతోంది కమలనాథ్ సర్కార్. ఇందుకోసం ప్రత్యేకంగా విదేశీ లిక్కర్‌ను దిగుమతి చేయబోతోంది. ప్రభుత్వ కొత్త లిక్కర్ పాలసీలో ఈ అంశాన్ని బాటిల్డ్ ఇన్ ఆరిజన్ (BIO) అని ప్రస్తావించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ అవుట్‌లెట్లు కూడా భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్‌లో రాబోతున్నాయి.

కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం... కొద్ది సంఖ్యలోని అవుట్‌లెట్లలో అత్యంత ఖరీదైన హై-ఎండ్ ప్రీమియం లిక్కర్... విదేశాల నుంచీ తెప్పించి అమ్ముతామని మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎక్స్జై కమిషనర్ రాజేష్ బహుగుణ తెలిపారు.

లిక్కర్ పాలసీ 2020-21 ప్రకారం... మధ్యప్రదేశ్ ప్రభుత్వం... ఆల్కహాల్ బాటిళ్ల (మద్యం బాటిళ్ల)కు బార్ కోడ్‌లు కూడా వెయ్యబోతోంది. తద్వారా ఆ బాటిళ్లు... ఎక్కడ తయారయ్యాయి, ఏ ఫ్యాక్టరీ నుంచీ వచ్చాయి, ఏ గోడౌన్‌లో ఉంచారు వంటి వివరాలు ఈజీగా తెలుస్తాయంటోంది. ఏది ఏమైనా.. ఓవైపు మద్యపానం ఆరోగ్యానికి హాని కరం అని ప్రకటనలు ఇస్తూ... మరోవైపు మద్యాన్ని తాగండహో అని ఎంకరేజ్ చేస్తుండటాన్ని ప్రభుత్వాలు ఎలా సమర్థించుకుంటాయో వాటికే తెలియాలి.
Published by: Krishna Kumar N
First published: February 29, 2020, 10:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading