పెండింగ్‌లో పదో తరగతి పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతగానో కసరత్తు చేస్తున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న పలు పదో తరగతి పరీక్షలు నిర్వహించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల ఆధారంగానే విద్యార్థుల మెరిట్ లిస్టును ప్రకటిస్తామని తెలిపింది. ఇంటర్ పరీక్షలను జూన్ 8 నుంచి జూన్ 16 మధ్య నిర్వహించనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటన చేశారు. మరోవైపు ఏపీలో పదో తరగతి పరీక్షలను జూలైలో నిర్వహించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... పదో పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే ఈ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మరోవైపు తెలంగాణలో పెండింగ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర హైకోర్టు నుంచి అనుమతి కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.