వ్యాక్సిన్ తీసుకున్న వారికి సన్మానం.. మధ్యప్రదేశ్ పోలీసుల కొత్త ఆలోచన

MP Police offers badge (1)

వ్యాక్సిన్ తీసుకున్న వారికి ‘నేను వ్యాక్సిన్ తీసుకున్నా. నేను దేశభక్తుడిని’ అనే బ్యాడ్జ్ ప్రదానం చేస్తున్నారు. సన్మానిస్తున్నారు

  • Share this:
కరోనా వైరస్ను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ తీసుకోవడమే ప్రధానంగా మారింది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వీలైనంత ఎక్కువ మంది టీకాలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొందరు ప్రజలు లేనిపోని అనుమానాలతో వ్యాక్సిన్కు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు సైతం కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిని సన్మానిస్తున్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకొని వారికి హెచ్చరిక పోస్టర్ తగిలిస్తున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారికి ‘నేను వ్యాక్సిన్ తీసుకున్నా. నేను దేశభక్తుడిని’ అనే బ్యాడ్జ్ ప్రదానం చేస్తున్నారు. సన్మానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ షేర్ చేసింది.

“వ్యాక్సిన్ తీసుకున్న వారిని మేం గౌరవిస్తున్నాం. ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే వారికి కూడా చెప్పండి. టీకా తప్పకుండా పొందాలని సూచించండి. అందుకే మిమ్మల్ని సన్మానిస్తున్నాం’ అని ఓ బైకర్తో పోలీసులు చెప్పారు. అలాగే వ్యాక్సిన్ వేసుకోని వారికి పోలీసులు హెచ్చరిక బ్యాడ్జీని తగిలిస్తున్నారు. ‘నేను ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదు. నాకు దూరంగా ఉండండి’ అని రాసి ఉన్న పోస్టర్ను తగిలిస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ల కొరత కారణంగానే చాలా మంది వేసుకోవడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది టీకా తీసుకోవపోవడానికి ఇది ఓ ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రభుత్వాలు వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొస్తే తీసుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారంటూ అభిప్రాయపడుతున్నారు.

కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా సబ్ ఇన్స్పెక్టర్ ఓ కొత్త తరహా శిక్ష వేశారు. 30 నుంచి 45 నిమిషాల పాటు రాముడి పేరు రాయించి, ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. “లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి తొలుత 45 నిమిషాలు కూర్చొబెట్టడం, గుంజిళ్లు తీయించడం చేశాం. అయితే ఖాళీగా కూర్చునే బదులు వారితో రామ నామం రాయించాలనుకున్నాం’ అని ఎస్ఐ సంతోష్ సింగ్ చెప్పారు.

ప్రస్తుతం దేశమంతా ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. దేశంలో ఇప్పటికే దాదాపు 20 కోట్ల మంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న కొవిషీల్డ్, కోవాగ్జిన్, స్ఫుత్నిక్వీతో పాటు త్వరలో ఫైజర్ టీకా కూడా భారత్లోకి రానుంది. మరిన్ని టీకాలను కూడా తీసుకొచ్చి దీపావళి నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఇప్పటికే చిన్నపిల్లలపై కూడా వ్యాక్సిన్ ట్రయల్స్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published by:Rekulapally Saichand
First published: