Home /News /national /

MADHYA PRADESH CM SHIVRAJ SINGH CHOUHAN CONGRATULATED THE JEE TOPPER ON TWITTER UMG GH

JEE- 2022: జేఈఈ టాపర్‌గా ఓ కూలి కొడుకు.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి ఊహించని రెస్పాన్స్..!

జేఈఈ టాపర్‌ని అభినందిస్తూ ట్వీట్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం

జేఈఈ టాపర్‌ని అభినందిస్తూ ట్వీట్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం

జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ పరీక్షకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందాలంటే జేఈఈలో వచ్చిన స్కోరే కీలకం. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ సెషన్ -1లో  మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్ ప్రజాపతి అనే విద్యార్థి 99.93 పర్సంటైల్ స్కోర్ సాధించాడు.

ఇంకా చదవండి ...
జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ పరీక్షకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందాలంటే జేఈఈలో వచ్చిన స్కోరే కీలకం. దీంతో చాలా మంది ఎన్నో ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతూ.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంటారు. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ సెషన్ -1లో మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్ ప్రజాపతి అనే విద్యార్థి 99.93 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. అతని తండ్రి రామ్ ప్రజాపతి ఓ కార్మికుడు. రోజువారి కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో కుమారుడిని చిన్నప్పటి నుంచి దేవాస్‌లోని ప్రభుత్వ బడులలోనే చదివించాడు.

దీపక్ 10వ తరగతిలో 96 శాతం స్కోర్ సాధించాడు. ఇక 12వ తరగతిలోనూ 92.6 శాతం మార్కులతో పాసై అయ్యాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష జేఈఈ కోసం 11వ తరగతి నుంచే సొంతంగా ప్రిపేర్ అవుతున్నాడు. చదువు పట్ల దీపక్ అంకితభావాన్ని చూసి తన తండ్రి బంధువుల దగ్గర అప్పు చేసి జేఈఈ కోచింగ్ కోసం ఇండోర్‌కు పంపాడు. అక్కడ ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో 9 నెలల పాటు కోచింగ్ తీసుకున్నాడు. తనపై తన తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని దీపక్ వమ్ముచేయలేదు. జేఈఈ మెయిన్‌లో 99.93 పర్సంటైల్ సాధించి నలుగురిలో శభాష్ అనిపించుకున్నాడు.

ఇదీ చదవండి: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. సైన్యమే దేశాన్ని చేతుల్లోకి తీసుకోనుందా.. విస్తుపోయే నిజాలు ఇవే !


దీపక్‌కు తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు. అతని తల్లి పేరు అనితా ప్రజాపతి. వీరంతా కలిసి ఓ చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. దీపక్ సాధించిన విజయం పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. అతనికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అభినందనలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. “మనసులో కోరిక బలంగా ఉంటే, ఒక మార్గం ఉంటుందని మీరు( దీపక్) చూపించారు. మీ విజయానికి మధ్యప్రదేశ్ గర్వపడుతోంది’’. అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

https://indianexpress.com/article/technology/techook/amazon-prime-day-2022-sale-best-deals-offers-apple-oneplus-samsung-smartphones-8031799/

సీఎం చౌహాన్‌కు దీపక్ కృతజ్ఞతలు తెలుపుతూ.. అంత పెద్ద వ్యక్తి నా గురించి ట్వీట్ చేయడం గర్వకారణమని, నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు. అలాగే జార్ఖండ్‌‌లోని రాంచీకి చెందిన కుషాగ్రా శ్రీవాస్తవ అనే విద్యార్థి జేఈఈలో 100 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. మొత్తంగా ఈ ఫీట్‌ను 14 మంది అందుకున్నారు. అందులో శ్రీవాస్తవ ఒకరు. టెస్ట్-టేకింగ్ స్కిల్స్ మెరుగుపర్చుకోవడానికి మాక్ టెస్ట్‌లను ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లు శ్రీవాస్తవ తెలిపారు. ప్రిపరేషన్‌లో ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) పుస్తకాలపై ఎక్కువగా ఆధారపడినట్లు.. అలాగే కోటా‌లోని అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ క్లాస్ నోట్ రివిజన్ చేయడానికి ఉపయోగపడినట్లు అతను వివరించాడు.కాగా, 2022కు సంబంధించి నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ఇటీవల విడుదలైంది. ఐఐటీ మద్రాస్ దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా మరోమారు నిలిచింది. ఈ ఇన్‌స్టిట్యూట్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం వరుసగా ఇది మూడోసారి. టాప్ 10లో 8 స్థానాలను ఐఐటీల‌కే దక్కాయి. ఐఐటీ ఢిల్లీ రెండో ర్యాంక్‌, ఐఐటీ బాంబే మూడో స్థానంలో నిలిచింది.
Published by:Mahesh
First published:

Tags: IIT, Jee mains 2022, Madhya pradesh, Shivraj Singh Chouhan

తదుపరి వార్తలు