సీఎం మేనల్లుడి అరెస్ట్.. రూ.354కోట్ల బ్యాంకు కుంభకోణం..

మోసర్ బేర్ కంపెనీకి రతుల్ పురి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న సమయంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి.

news18-telugu
Updated: August 20, 2019, 9:14 AM IST
సీఎం మేనల్లుడి అరెస్ట్.. రూ.354కోట్ల బ్యాంకు కుంభకోణం..
రతుల్ పురి
  • Share this:
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురిని మంగళవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అరెస్ట్ చేసింది. రతుల్ పురిపై రూ.354కోట్ల బ్యాంకు కుంభకోణం ఆరోపణలున్నాయి.మోసర్ బేర్ కంపెనీకి రతుల్ పురి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న సమయంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఆయనతో పాటు మోసర్ బేర్ సంస్థకు చెందిన మరో నలుగురు డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇందులో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ పురి,డైరెక్టర్స్ నీతా పురి,సంజయ్ జైన్,వినీత్ శర్మ ఉన్నారు.ఇదే కేసుకు సంబంధించి సీబీఐ ఆదివారం,సోమవారం ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

కాగా, మోసర్ బేర్ అనేది డిజిటల్ డేటా స్టోరేజ్ రంగంలో సేవలు అందించింది. కాంపాక్ట్ డిస్కులు,డీవీడీలు,స్టోరేజ్ డివైజ్‌లు ఇందులో తయారయ్యేవి.కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఈ సంస్థ మూతపడింది. రతుల్ పురిపై అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం ఆరోపణలు కూడా ఉన్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ ముడుపులకు సంబంధించిన నగదు మోసర్ బేర్ సంస్థ ద్వారానే చేతులు మారిందని విచారణలో తేలింది. ఇదే కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ.. విచారణకు హాజరుకాని కారణంగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపింది.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>