Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ సీఎం కీలక నిర్ణయం.. కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతుండటంతో...

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (ఫైల్ ఫొటో)

నగరాల్లో కేసులు మరింతగా పెరిగితే పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ జోన్లను కూడా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని అన్ని అర్బన్ ప్రాంతాలలో బుధవారం నుంచే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ...

  • Share this:
    భోపాల్: భారత్‌లో కరోనా మరోమారు తీవ్ర రూపం దాల్చింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,26,789 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రోజుకు లక్ష కేసులకు పైగా నమోదవుతున్నా ప్రజలు కోవిడ్-19 నిబంధనలను అంతగా పాటిస్తుండకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. మధ్యప్రదేశ్‌లోని అర్బన్ ప్రాంతాల్లో 60 గంటల పాటు వారాంతపు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ అర్బన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సీఎం తెలిపారు. నగరాల్లో కేసులు మరింతగా పెరిగితే పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ జోన్లను కూడా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని అన్ని అర్బన్ ప్రాంతాలలో బుధవారం నుంచే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ వచ్చే మూడు నెలల పాటు సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిచేస్తాయని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. చింద్‌వారా జిల్లాలో గురువారం రాత్రి 8 గంటల నుంచి వచ్చే వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటి నుంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకుంటూనే ఉంది. అందులో భాగంగానే.. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గర్‌కు ఏప్రిల్ 15 వరకూ బస్సు సర్వీసులపై నిషేధం విధించింది. బుధవారం ఒక్కరోజే మధ్యప్రదేశ్‌లో కొత్తగా 4,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,014కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 26,059. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకూ 2,87,860 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా బుధవారం 13 మంది చనిపోయారు. దీంతో మధ్యప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య 4,086కు చేరింది.

    మధ్యప్రదేశ్‌లోని అతి పెద్ద నగరమైన ఇండోర్‌లో కరోనా కేసులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆ ఒక్క నగరంలోనే కొత్తగా 866 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లో కూడా కొత్తగా 628 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇండోర్‌లో ఇప్పటివరకూ 981 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, భోపాల్‌లో 641 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

    ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కాదు గుజరాత్‌లో కూడా కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో.. గుజరాత్‌లోని పోర్బందర్‌లో ఏప్రిల్ 21 వరకూ పార్క్‌లు, బీచ్‌ల వద్దకు వెళ్లకుండా నిషేధం విధిస్తున్నట్లు పోర్బందర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఇక.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ డూన్ స్కూల్‌లో 12 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఆ స్కూల్‌ను రెస్ట్రిక్టెడ్ జోన్‌గా ప్రకటించింది.
    Published by:Sambasiva Reddy
    First published: