MADHYA PRADESH BUS DRIVER GETS 190 YEARS IN JAIL FOR ROAD ACCIDENT THAT KILLED 22 PASSENGERS SK
ఆ బస్సు డ్రైవర్‌కు 190 ఏళ్ల జైలు శిక్ష.. రోడ్డు ప్రమాదం కేసులో కోర్టు సంచలన తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
190 years jail for bus driver: నిర్లక్ష్యంగా బస్సును నడిపి.. రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ఎవరూ ఊహించనన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఏకంగా 190 ఏళ్ల పాటు కారాగార శిక్ష వేస్తూ తీర్పు వెలువరించింది.
అది ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident). అందరూ చూస్తుండగానే.. కళ్ల ముందే.. దారుణం జరిగిపోయింది. రోడ్డుపై బస్సు బోల్తా పడి మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో ఏకంగా 22 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. హాహాకారాలు చేస్తూ మంటల్లో కాలిపోయారు. ఆ కేసులో తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిర్లక్ష్యంగా బస్సును నడిపి.. రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ఎవరూ ఊహించనన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఏకంగా 190 ఏళ్ల పాటు కారాగార శిక్ష వేస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పుడు ఈ తీర్పు గురించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఆరేళ్ల క్రితం మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2015 మే 4న పన్నా జిల్లాలో బస్సు బోల్తా పడింది. (2015 Madhya pradesh bus Accident) ఛతర్పూర్ నుంచి పన్నాకు వెళ్తుండగా.. మాడ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కల్వర్ట్ను ఢీకొట్టింది. అనంతరం బోల్తా పడింది. డీజిల్ ట్యాంక్ లీకై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో చాలా మంది ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. కానీ 22 మంది మాత్రం అక్కడిక్కడే మరణించారు. మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ కాకుండా.. బ్లాక్ అవ్వడంతో.. చాలా మంది బస్సులోనే ఉండిపోయి.. మంటల్లో కాలిపోయారు. రెస్క్యూ సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మృతుల్లో అత్యధిక మంది కూలీ పనులు చేసుకునే వారే ఉన్నారు.
రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బస్సు ఓనర్, డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరేళ్లగా ఈ కేసుపై కోర్టులో వాదనలు సాగాయి. పోలీసుల దర్యాప్తు పూర్తైన తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి ఆర్పీ సోంకర్ ఆధ్వర్యంలో కేసుపై విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. రోడ్డు ప్రమాదాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి, గరిష్టంగా శిక్షించాలని ఆక్ష్న అభ్యర్థించారు. దీనిపై సుదీర్ఘ కాలం వాదనలు విన్న తర్వాత.. తాజాగా గత శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించిన కోర్టు... డ్రైవర్ మొహమ్మద్ షంషుద్దీన్‌కు కఠిన శిక్ష విధించింది. సెక్షన్ 304 (పార్ట్ II) ప్రకారం ఏకంగా 190 సంవత్సరాల జైలు శిక్ష విధింస్తూ తీర్పు వెలువరించింది. ఇక బస్సు యజమాని జ్ఞానేంద్ర పాండేకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.