హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

విద్యాశాఖ కీలక నిర్ణయం.. పాఠశాలలకు 4 రోజుల పాటు సెలవు.. ఎందుకో తెలుసా..?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. పాఠశాలలకు 4 రోజుల పాటు సెలవు.. ఎందుకో తెలుసా..?

తీవ్రంగా వీస్తున్న చలిగాలులు

తీవ్రంగా వీస్తున్న చలిగాలులు

Madhya Pradesh: భింద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో చిన్న, పెద్దవాళ్లు తీవ్రమైన చలిగాలుతో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసిన మంచుతో నిండి ఉంటుంది. దీంతో అక్కడ ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించింది.

  • Local18
  • Last Updated :
  • Madhya Pradesh, India

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) భింద్ జిల్లా ఈ రోజుల్లో చలిగాలుల పట్టిపీడిస్తోంది. నిజానికి ఉదయం, సాయంత్రం వేళల్లో చలి గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో, దట్టమైన పొగమంచు కూడా కనిపిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలకు పడిపోయింది. అదే సమయంలో, గరిష్టంగా 17.5 డిగ్రీల వద్ద కూడా నమోదైంది. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భిండ్ కలెక్టర్ సతీష్ కుమార్ ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు వచ్చే నాలుగు రోజులు సెలవు ప్రకటించారు.

చలి ఎక్కువగా ఉండటం వలన పిల్లలు అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతే కాకుండా.. పెద్ద వయసుల వారిలోనే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా చూడసాగింది. భింద్ జిల్లాలో గత మూడు రోజులుగా చలిగాలులు వీస్తున్నాయి. చలిగాలుల దృష్ట్యా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ భింద్ కలెక్టర్ తీవ్రమైన చలిని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు నాలుగు రోజుల సెలవు ప్రకటించారు.

యేల్లో అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం..

వాతావరణ శాస్త్రవేత్త వేదప్రకాశ్ శర్మ ప్రకారం, ఈసారి శీతాకాలం ఇతర సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భింద్‌లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు నిరంతరం తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో, ఈ రోజు (బుధవారం) ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలకు చేరుకుంది. దీంతో భింద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

First published:

Tags: Madhya pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు