HOME »NEWS »NATIONAL »machine given tea after give garbage in kumbh mela sb

కుంభమేళాలో చెత్తచెదారం వేస్తే... గరమ్ చాయ్ ఫ్రీ

కుంభమేళాలో చెత్తచెదారం వేస్తే... గరమ్ చాయ్ ఫ్రీ
కుంభమేళా (ఫైల్ ఫొటో)

దీంతో కుంభమేళలో ఓ వెరైటీ స్టాల్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్‌లో అందరికీ టీ ఫ్రీ అన్నమాట. అయితే ఇక్కడ మనం ఓ పనిచేయాలి.

  • Share this:
    స్వచ్ఛభారత్ ... కుంభమేళాలో కూడా జోరుగా కొనసాగుతుంది. యూపీ ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతుంది. నిత్యం వేలాదిగా భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తున్నారు. అయితే అంతమంది వస్తుంటే అక్కడ చెత్త కూడా ఏ స్థాయిలో పేరుకుపోతుందో తెలియంది కాదు. దీంతో కుంభమేళలో ఓ వెరైటీ స్టాల్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్‌లో అందరికీ టీ ఫ్రీ అన్నమాట. అయితే ఇక్కడ మనం ఓ పనిచేయాలి. అక్కడ ఏర్పాటు చేసిన టీ మెషిన్‌లో చెత్తవేయాలి. ఏదైనా చెత్త తీసుకొచ్చి అందులో వేయగానే మనకు వేడ వేడి టీ వస్తుంది. దీంతో అక్కడకు వచ్చిన భక్తులు చాలామంది చెత్తను రోడ్డుపై పడేయకుండా మెషిన్‌లో వేస్తూ ఏం చక్కా టీ తాగుతున్నారు.

    కుంభమేళలో చెత్తకు టీ ఫ్రీ అంటూ ఏర్పాటు చేసిన నిర్వాహకులు మనీష్ ... రోజుకు సుమారు 1500వరకు టీ కప్పులు ఖాళీ అవుతున్నాయని చెబుతున్నారు. చాలామంది రోడ్డుపై ఉన్న చెత్తను సైతం ఏరుకొచ్చి ఇందులో వేస్తున్నారని చెబుతున్నారు. ఈ చాయ్ ఫ్రీ మెషిన్ కోసం తెలుసుకున్నవారంతా స్వచ్ఛంందంగా వచ్చి చెత్తను ఏరి మరి ఇందులో వేసి టీ తాగుతున్నారనంటున్నారు. ఈ మెషిన్ సెన్సార్‌తో పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. అందులో బాటిల్స్, కవర్స్ లేదా ఏదైనా చెత్త చెదారం వేయగానే ...మెషిన్ నుంచి టీ వస్తుంది. ఈ కొత్త ప్రయోగం వల్ల చుట్టుపక్కల ప్రాంతమంతా ఎలాంటి చెత్త చెదారం లేక ఎంతో పరిశుభ్రంగా మారిందన్నారు.


    First published:February 06, 2019, 23:00 IST

    टॉप स्टोरीज