స్వీపర్ పోస్టుకు బీటెక్, ఎంటెక్, ఎంబీయే గ్రాడ్యుయేట్ల దరఖాస్తు

ప్రతీకాత్మక చిత్రం

మొత్తం 4,607 దరఖాస్తులు అందాయి. వీటిలో సరైన ప్రామాణికతలు పూర్తి చేయనందున 677 దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించారు.

  • Share this:
దేశవ్యాప్తంగా నిరుద్యోగం రాజ్యమేలుతుంది. డిగ్రీలు, ఎంబీయేలు, ఎంటెక్‌లు చదివిన వారంతా ఉద్యోగాలు దొరక్క బయోడేటాలు, సర్టిఫికెట్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరైనా ఉద్యోగం ఇవ్వకపోరా అంటూ ఆఫీసులు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు ఏదైనా ఉద్యోగాలు నోటిఫికేషన్ పెడితే చాలు.. ఎలాంటి ఉద్యోగం అయినా సరే దరఖాస్తులు చేసుకుంటున్నారు. చదివింది ఎంత పెద్ద చదువైనా సరే... ఎలాంటి ఊడిగం చేయడానికి పాపం సిద్దమవుతున్నారు. తమిళనాడులో నిరుద్యోగుల కష్టాలకు అద్దం పట్టే ఇలాంటి ఘటనే జరిగంది.

తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌లో స్వీపర్‌, సానిటరీ కార్మికుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. దీంతో ఎంటెక్‌, బిటెక్‌, ఎంబిఎ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులు వేలల్లో వచ్చి పడ్డాయి. వీరితో పాటు డిప్లామో పట్టా పొందిన వారు కూడా స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 స్వీపర్‌ పోస్టులకు, 4 శానిటరీ కార్మికుల పోస్టులకు మాత్రమే గత ఏడాది సెప్టెంబర్‌ 26న అసెంబ్లీ సెక్రటేరియట్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. సంబంధిత విభాగంలో అనుభవం ఉంటే సరిపోతుందని పేర్కొంది.

దీంతో ఎంప్లాయిమెంట్‌ ఎక్సైంజ్‌తో సహా మొత్తం 4,607 దరఖాస్తులు అందాయి. వీటిలో సరైన ప్రామాణికతలు పూర్తి చేయనందున 677 దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించారు. దీంతో స్వీపర్ ఉద్యోగాలకు కూడా డిగ్రీలు, పీజీలు చదివిన వారంతా దరఖాస్తు చేసుకోవడంతో... అధికారులు సైతం అవాక్కయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఈ స్థాయిలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. మరి దీనిపై అక్కడి పళనిస్వామి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
First published: