కొత్త వాహన చట్టం దెబ్బకు వాహనదారులు వణికిపోతున్నారు. వేలకు వేలు జరిమానాలు విధిస్తుండడంతో బెంబేలెత్తుతున్నారు. రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. బయటకు వచ్చే ముందు సర్టిఫికెట్లను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని వస్తున్నారు. ఈ ట్రాఫిక్ రూల్స్‌తో వాహనదారులు తిప్పలు పడుతుంటే.. లారీ డ్రైవర్లకు కొత్త చిక్కు వచ్చిపడింది. దుస్తుల విషయంలో నిబంధనలు పెట్టడడంతో...ఇదేంటని షాకవుతున్నారు. లుంగీలు, బనియన్లతో లారీ నడిపితే ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.2వేలు జరిమానా విధిస్తున్నారు. యూపీలో చాలా మంది ట్రక్కు డ్రైవర్లకు ఇప్పటికే ఫైన్ వేశారు.
లారీ డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని యూపీ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. లుంగీ, బనియన్‌తో డ్రైవింగ్ చేయకూడదని స్పష్టంచేశారు. లారీ డ్రైవర్లు ఖచ్చితంగా ప్యాంట్, షర్ట్ లేదంటే టీ షర్ట్ వేసుకొని డ్రైవింగ్ చేయాలని.. లేదంటే ఫైన్ పడుతుందని తెలిపారు. స్కూలు వ్యాన్ డ్రైవర్లు, ప్రభుత్వ వాహనాలకూ ఈ నిబంధనలు వర్తిస్తుందని చెప్పారు. డ్రైవర్లు సరైన దుస్తులు ధరించాలని 1939 వాహన చట్టంలోనే ఉందని క్లారిటీ ఇచ్చారు పోలీసులు.
సెప్టెంబరు 1 దేశంవ్యాప్తంగా నుంచి నూతన వాహన చట్టం అమల్లోకి వచ్చచింది. కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రావడంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు పెద్ద మొత్తంలో చలాన్లు పడుతున్నాయి. వేలకు వేలు ఫైన్లు పడుతుండడంతో కొందరైతే వాహనాలను పోలీసుల దగ్గరే వదిలివేసి వెళ్తున్నారు. ఇలాగైతే ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుందని కేంద్రం తీరుపై మండిపడుతున్నారు వాహనదారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Motor vehicle act, Traffic, Traffic challans, Traffic rules, Uttar pradesh