హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Punjab : ఒకే కుటుంబానికి చెందిన 7గురు సజీవదహనం.. అందులో 5గురు పిల్లలు -గుడిసెకు నిప్పంటుకొని..

Punjab : ఒకే కుటుంబానికి చెందిన 7గురు సజీవదహనం.. అందులో 5గురు పిల్లలు -గుడిసెకు నిప్పంటుకొని..

ప్రమాదం తర్వాత దృశ్యాలు

ప్రమాదం తర్వాత దృశ్యాలు

చెత్త కుప్ప పక్కనే గుడిసెలు వేసుకొని.. చెత్త ఏరుకునే జీవితాలు వారివి.. బుధవారం తెల్లవారుజామున వారి జీవితాలు తెల్లారిపోయాయి.. చెత్తలో చెలరేగిన మంటలు గుడిసెకు అంటుకోని.. గాఢనిద్రలో ఉన్న వారంతా సజీవదహనం అయ్యారు..

వారంతా సొంత ఇల్లు లేని నిరుపేదలు.. చెత్త కుప్ప పక్కనే గుడిసెలు వేసుకొని.. చెత్త ఏరుకునే జీవితాలు వారివి.. బుధవారం తెల్లవారుజామున వారి జీవితాలు తెల్లారిపోయాయి.. చెత్తలో చెలరేగిన మంటలు గుడిసెకు అంటుకోని.. గాఢనిద్రలో ఉన్న వారంతా సజీవదహనం అయ్యారు.. చనిపోయిన ఏడుగురిలో ఐదుగురు పిల్లలే కావడం మరింత విషాదకరం. వివరాలివే..

పంజాబ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. లూథియానా సిటీలో ఓ గుడిసెలో మంటలు చెలరేగడంతో కుటుంబంలోని ఏడుగురు సజీవదహనమయ్యారు. వారు వలస కూలీలని, ఇక్కడి టిబ్బా రోడ్డులోని మున్సిపల్ చెత్త డంప్ యార్డు సమీపంలోని తమ గుడిసెలో నిద్రిస్తున్నారని అధికారులు తెలిపారు.

కాలిబూడిదైన గుడిసె

HBD CBN: గొంతులో విషం దాచుకున్న శివుడు! -పుట్టినరోజు కూడా టీడీపీ చంద్రబాబు బాదుడే బాదుడు..


లూథియానా అగ్నిప్రమాదం తర్వాత దృశ్యం

లుథియానా మునిసిపల్ చెత్త డంప్ యార్డ్ సమీపంలోని తమ గుడిసెలో వారు నిద్రిస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందని లూథియానా అసిస్టెంట్ కమిషనర్ (ఈస్ట్) సురీందర్ సింగ్ తెలిపారు. టిబ్బా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రణబీర్ సింగ్ సంఘటన స్థలానికి వచ్చారు. మృతుల్లో దంపతులతోపాటు వారి ఐదుగురు పిల్లలుగా గుర్తించారు. వారి పేర్లు ఇంకా నిర్ధారించలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

First published:

Tags: Fire Accident, Punjab

ఉత్తమ కథలు