Home /News /national /

LUCKNOW DOCTOR SHARDA SUMAN DIES IN HYDERABAD WITH CORONAVIRUS AFTER 4 MONTH STRUGGLE SU

Very Sad: డాక్టర్‌గా ఆమె ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు.. నాలుగు నెలల పోరాటం.. పాపం పుట్టిన బిడ్డను కూడా చూసుకోకుండానే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆమె ఓ డాక్టర్.. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సేవలు అందించి ప్రాణాలు నిలబెట్టింది. గర్భవతి కూడా ఉండి తన విధులను నిర్వర్తించింది.

    ఆమె ఓ డాక్టర్.. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సేవలు అందించి ప్రాణాలు నిలబెట్టింది. గర్భవతి కూడా ఉండి తన విధులను నిర్వర్తించింది. చివరకు అదే మహమ్మారి బారిన పడి చాలా ఇబ్బందులు పడింది. నాలుగు నెలలకు పైగా మృత్యువుతో పోరాడి.. చివరకు పరిస్థితి పూర్తిగా విషమించడంతో హైదరాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో(KIMS Hospital) తుదిశ్వాస విడిచారు. కనీసం తనకు పుట్టిన బిడ్డను చూసుకోకుండానే ప్రాణాలు వదిలారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన 31 ఏళ్ల శారద సుమన్.. లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో(Ram Manohar Lohia Institute of Medical Sciences) రెసిండెంట్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త అజయ్ కుమార్ కూడా డాక్టర్‌గా ఉన్నారు. ఆమె కరోనా కష్టకాలంలో ఎంతో మంది రోగులకు వైద్యం అందించారు.

    ఆమె గర్భవతిగా ఉన్నప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటూ రోగులకు చికిత్స అందించారు. వృత్తిపై అపార గౌరవంతో.. తన విధులను నిర్వర్తించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ఆమె కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్ 14న ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. అప్పటికీ శారద 8 నెలల గర్భవతి. అయితే కరోనా ఆమె ఉపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపింది. కొద్ది రోజుల్లోనే ఆమె ఆరోగ్యం విషమించింది. దీంతో ఆమెకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు.

    Smartphones To Students: టీచర్ గొప్ప మనసు.. విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు.. సన్మానించిన ప్రభుత్వం..

    ఇదిలా ఉంటే ఆమెకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ నిర్వహించి.. పురుడు పోశారు. ఆమెకు ఆడబిడ్డ జన్మనిచ్చింది. అయితే ఆమె ఉన్న పరిస్థితుల్లో భూమి మీదకు వచ్చిన బిడ్డను తాకలేని.. కనీసం చూడలేని పరిస్థితి. ఇక, శారద ప్రాణాలు కాపాడటానికి.. వైద్యులు తీవ్రంగా శ్రమించారు. శారద ప్రాణాలు నిలపడానికి అవసరమైన ఆర్థిక సాయం కోసం ఆమె భర్త, ఆమె పనిచేస్తున్న ఆస్పత్రి వైద్యులు.. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌( Yogi Adityanath) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన చికిత్స కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేశారు.

    Nipah Virus: ఆ పండు తినడం వల్లే బాలుడికి నిఫా వైరస్ సోకిందా?.. కేరళను కలవరపెడుతున్న నిఫా..

    ఈ క్రమంలోనే శారదకు ఉపిరితిత్తుల మార్పిడి కోసం జులై 11న ఎయిర్‌ అంబులెన్సులో లక్నో నుంచి హైదరాబాద్‌కు తరలించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చి చికిత్స ప్రారంభించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఉపిరితిత్తుల మార్పిడి సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే పరిస్థితి పూర్తిగా విషమించడంతో.. ఆమె ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

    డాక్టర్ శారదా సుమన్ సెప్టెంబర్ 5 రాత్రి కన్నుమూసినట్లు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు తమకు తెలియజేశారు అని RMLIMS వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆమె కుటుంబంలోనే కాకుండా, తోటి వైద్యులలో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఆమె పాపకు నాలుగు నెలలు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Coronavirus, Hyderabad, Lucknow

    తదుపరి వార్తలు