LUCKNOW BOUND INDIGO FLIGHT MAKES EMERGENCY LANDING AT NAGPUR PVN
IndiGo flight : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..ఎందుకో తెలుసా
ప్రతీకాత్మక చిత్రం
IndiGo emergency landing : గత వారం, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో భారత వైమానిక దళం (IAF) దేశవ్యాప్తంగా రహదారులపై 28 ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాలను (ELF)కలిగి ఉన్నట్లు తెలియజేశారు.
IndiGo emergency landing : మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో నాగ్‌పూర్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. టేకాఫ్ తర్వాత, అనుమానాస్పద సాంకేతిక లోపం కారణంగా వెంటనే నాగ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు ఇండిగో ఎయిర్ లైన్ కంపెనీ సోమవారం తెలిపింది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత పైలట్లు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల మేరకు విమానాన్ని తిరిగి సురక్షితంగా విమానాశ్రయానికి తీసుకువచ్చారని అధికారులు పేర్కొన్నారు. విమానం నుంచి పొగలు రావడంతో ఇండిగో విమానాన్ని నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించిందని డీజీసీఏ అధికారి తెలిపారు.
గత వారం, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో భారత వైమానిక దళం (IAF) దేశవ్యాప్తంగా రహదారులపై 28 ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాలను (ELF)కలిగి ఉన్నట్లు తెలియజేశారు. ఇలాంటి ఈఎల్‌ఎఫ్‌లు అస్సాంలో ఐదు, పశ్చిమ బెంగాల్లో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు, గుజరాత్లో మూడు, రాజస్థాన్‌లో మూడు, బీహార్‌లో రెండు, హర్యానాలో రెండు, జమ్మూ కాశ్మీర్లో రెండు, తమిళనాడులో రెండు, పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.