బైక్ ట్యాక్సీ ఎక్కిన యువతి.. సెక్స్ గురించి మాట్లాడుతూ.. చేతులు వేస్తూ..

ట్యాక్సీ బుకింగ్ వివరాల ఆధారంగా బైక్ డ్రైవర్‌ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: October 17, 2019, 5:42 PM IST
బైక్ ట్యాక్సీ ఎక్కిన యువతి.. సెక్స్ గురించి మాట్లాడుతూ.. చేతులు వేస్తూ..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
బైక్ ట్యాక్సీ ఎక్కిన ఓ యువతి పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. వెనకాల కూర్చున్న ఆ యువతిని చేత్తో టచ్ చేస్తూ.. సెక్స్ గురించి మాట్లాడుతూ లైంగికంగా వేధించాడు. ప్రైవేట్‌ భాగాలను తాకుతూ అసభ్యకర పదజాలంతో దూషించాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అమెరికాకు చెందిన ఓ యువతి లక్నోలోని హజరత్‌గంజ్లో నివాసం ఉంటోంది. న్యూ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తోంది. గురువారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు బైక్ ట్యాక్సీ బుక్‌చేసుకుంది. బైక్‌పై వెళ్తుండగా ఆమెను ట్యాక్సీ డ్రైవర్ వేధించాడు.

శృంగారం గురించి మాట్లాడుతూ ఆ యువతి ప్రైవేట్ భాగాలతో టచ్ చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో కోపంతో ఊగిపోయిన డ్రైవర్.. యువతిని బండబతులు తిట్టాడు. అతడి చేష్టలను భరించలేక బలవంతంగా బైకి దిగి వెళ్లిపోయింది బాధితురాలు. జరిగిన విషయాన్ని తోటి ఉద్యోగులు, మిత్రులతో చెప్పి... అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్యాక్సీ బుకింగ్ వివరాల ఆధారంగా బైక్ డ్రైవర్‌ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు