Exclusive: చైనాకు దక్కింది బ్యాడ్ నేమ్ ఒక్కటే.. లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి ప్రత్యేక ఇంటర్వ్యూ

లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి (Image;@NorthernComd_IA/Twitter)

చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోలేదని లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి స్పష్టం చేశారు. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ నార్తన్ కమాండ్ అయిన లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి CNN News18 డిఫెన్స్ ఎడిటర్ శ్రేయా ధోండియాల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

 • Share this:
  చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోలేదని లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి స్పష్టం చేశారు. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ నార్తన్ కమాండ్ అయిన లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి CNN News18 డిఫెన్స్ ఎడిటర్ శ్రేయా ధోండియాల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే సమయంలో 2020 జూన్‌లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో ఎంతమంది చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వారు చనిపోయారో కూడా వెల్లడించారు. కనీసం 45 మంది చైనీస్ జవాన్లు హతమయ్యారని తెలిపారు. ఈ ఘటన తర్వాత చైనా కేవలం ముఖం చూపించుకోలేకపోయిందన్నారు. ప్రస్తుతం పాంగ్‌సాంగ్ సో లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతోందని ఆయన అన్నారు. ఫిబ్రవరి 10న బలగాల ఉపసంహరణ ప్రక్రియను మొదలు పెట్టామని, నాలుగు దశల్లో ఇది ఉంటుందన్నారు. దీన్ని విడుతల వారీగా అమలు చేస్తామన్నారు. ప్రతి రోజూ ఉదయాన్ని ఓ ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ రోజు ఏం చేయాలో రెండు వైపుల వారూ చర్చించుకుని, ఆ తర్వాత పని ప్రారంభిస్తామన్నారు. ఆ రోజు సాయంత్రం రెండు వైపుల వారూ ఎక్కడ వరకు వెనక్కు మళ్లారని క్రాస్ చెక్ చేసుకుని హాట్ లైన్స్ గీస్తామని చెప్పారు. ఆ రకంగా ఆ రోజు చేపట్టిన పని ఎంత వరకు ముందుకు వెళ్లిందనేది క్లారిటీ వస్తుందన్నారు.

  ఫిబ్రవరి 10న ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే చైనీస్ ఆర్మీ కూడా నడుచుకుంటోందని వైకే జోషి వెల్లడించారు. ఫిబ్రవరి 10న తాము చేసినట్టే వాళ్లు కూడా చాలా వేగంగానే వెనక్కు వెళ్తున్నారని చెప్పారు. ప్రతి రోజూ ఏం జరుగుతుందనేది తాము శాటిలైట్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నట్టు తెలిపారు. కొన్నిచోట్ల కెమెరాలను కూడా ఏర్పాటు చేసి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నామని వైకే జోషి వెల్లడించారు. స్టెప్ 2, స్టెప్ 3 అనేవి ఉత్తరం, దక్షిణం వైపున ఉంటుందన్నారు.

  భారత ప్రభుత్వం ఫింగర్ 8 మన సరిహద్దుగా చెబుతున్నామని, చైనీస్ బలగాలు దానికి అవతలి వైపు వెనక్కి వెళ్తున్నాయని చెప్పారు. ఫింగర్ 4, ఫింగర్ 8 మధ్య ఏప్రిల్ నుంచి వారు నిర్మించిన వన్నీ తొలగించేశారని తెలిపారు. వారి బంకర్లు, టెంట్‌లు అన్నీ పీకేశారని చెప్పారు. ఏప్రిల్ 2020కి ముందు ఆ ప్రాంతం ఎలా ఉండేదో మళ్లీ అలాగే ఉందన్నారు. ఫింగర్ 8 ప్రాంతంలో వారు ఎలాంటి యాక్టివిటీ చేయరని స్పష్టం చేశారు. కాబట్టి ఇది విజయంగా భావించాలన్నారు. ఈ బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత కొత్త పెట్రోలింగ్ పాలసీ తీసుకొస్తామని వైకే జోషి అన్నారు.

  ఆగస్టు 29, 30 తేదీల్లో భారత ఆర్మీ కైలాష్ రేంజ్‌ను ఆధీనంలోకి తీసుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైకే జోషి చెప్పారు. ఆగస్టు 31వ తేదీన కొందరు చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వస్తున్నట్టు తాము గుర్తించామన్నారు. ఆ సమయంలో తమకు క్లియర్‌గా ఉందని, ట్రిగ్గర్ నొక్కడమే మిగిలిందన్నారు. కానీ, యుద్ధం వస్తే ఆ పరిస్థితి వేరుగా ఉండేదని, ఆ సమయంలో ట్రిగ్గర్ నొక్కడం కంటే ఫైరింగ్ ఓపెన్ చేయడం కంటే సహనంగా ఉండడానికి ధైర్యం కావాలని అన్నారు. అయితే, ఆ విషయంలో తమకు పూర్తి స్వేఛ్ఛ ఉందని, తాము ఏం చేయాలనుకున్నా చేసే స్వేచ్ఛ తమకు ఇచ్చారని వైకే జోషి వెల్లడించారు.

  అసలు చైనీస్ ఎందుకు దూసుకొచ్చారనే అంశం సర్ ప్రైజ్‌గా ఉందని వైకే జోషి అన్నారు. 2009 - 11 నుంచి తాము తూర్పు లద్దాక్ ప్రాంతంలో దశల వారీగా బలగాలను పెంచుతున్నామని, మొదట రెండు బెటాలియన్లు ఉండే బలగాలను పెంచుతూ అక్కడ తాము మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. దీన్ని చూసి చైనీస్ బలగాలు కంగారుపడి వారు కొండలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు భావిస్తున్నామన్నారు. LAC విషయంలో ఓ క్లారిఫికేషన్ కోసం వారు ప్రయత్నించి ఉండొచ్చని, కానీ, ఈ విషయంలో వారు సాధించిందేమీ లేదన్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: