హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Anil Chauhan : దేశపు కొత్త సీడీఎస్ గా బాధ్యతలు చేపట్టిన అనిల్ చౌహాన్

Anil Chauhan : దేశపు కొత్త సీడీఎస్ గా బాధ్యతలు చేపట్టిన అనిల్ చౌహాన్

త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్

త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్

New CDS : భారత త్రివిధ దళాధిపతిగా(CDS)రిటైర్డ్ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్(61) శుక్రవారం(సెప్టెంబర్ 30,2022) బాధ్య‌త‌లు స్వీక‌రించారు. భార్య అనుప‌మా చౌహాన్‌తో క‌లిసి ఆయ‌న ఇవాళ సీడీఎస్ ఆఫీసుకు వ‌చ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

New CDS : భారత త్రివిధ దళాధిపతిగా(CDS)రిటైర్డ్ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్(61) శుక్రవారం(సెప్టెంబర్ 30,2022) బాధ్య‌త‌లు స్వీక‌రించారు. భార్య అనుప‌మా చౌహాన్‌తో క‌లిసి ఆయ‌న ఇవాళ సీడీఎస్ ఆఫీసుకు వ‌చ్చారు. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు జాతీయ యుద్ధస్మారకం వద్ద తన తండ్రి సురేంద్ర సింగ్ చౌహాన్​తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు అనిల్ చౌహాన్(Anil Chauhan). ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో సైనికుల గౌరవవందనాన్ని స్వీకరించారు. భార‌త సైనిక ద‌ళాల్లో అత్య‌ధిక ర్యాంకు ద‌క్క‌డం గ‌ర్వంగా ఉంద‌ని బాధ్యతలు చేపట్టిన అనంతరం అనిల్ అన్నారు. త్రివిధ ద‌ళాల ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లుగా ప‌నిచేయ‌నున్న‌ట్లు చెప్పారు. అన్ని స‌వాళ్ల‌ను, అవ‌రోధాల‌ను క‌లిసిక‌ట్టుగా ఎదుర్కోనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

అనిల్‌ చౌహాన్‌ తన 40 ఏండ్ల సర్వీసులో సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. మే 18,1961న ఉత్తరాఖండ్​లోని ఘర్వాల్​లో జన్మించిన అనిల్‌ చౌహాన్‌. మహారాష్ట్ర ఘడక్​వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీ, ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​లోని​ ఇండియన్​ మిలటరీ అకాడమీలో సైనిక శిక్షణ పొందారు.నార్తర్న్ కమాండ్​లోని బారాముల్లా సెక్టార్​లో మేజర్ జనరల్ హోదాలో ఇన్​ఫాంట్రీ డివిజన్​కు అనిల్ చౌహాన్​ నేతృత్వం వహించారు.ఈశాన్య భారతంలోనూ కమాండర్​గా పనిచేశారు. 2019 సెప్టెంబర్​లో తూర్పు కమాండ్​ జనరల్​ ఆఫీసర్​ కమాండింగ్​ ఇన్​ చీఫ్​గా పదోన్నతి పొందారు. 2021 మేలో రిటైర్డ్ అయ్యారు. జాతీయ భద్రతకు కీలకమైన అనేక అంశాల్లో తన విలువైన సలహాలు అందించారు.సైన్యంలో అందించిన సేవలకుగానూ పరమ్​ విశిష్ట్ సేవా పతకం, ఉత్తమ్​ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట్ సేవా పతకం, సేనా పతకం, విశిష్ట్ సేవా పతకం అందుకున్నారు. జమ్ముకశ్మీర్​, ఈశాన్య భారత్​లో తీవ్రవాద కార్యకలాపాల్ని అడ్డుకోవడంలో ఆయనకు విశేష అనుభవం ఉందని కేంద్రం ప్రకటనలో పేర్కొంది.

ట్రాఫిక్ కష్టాలకు చెక్..బెంగుళూరులో హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం!

కాగా,నరేంద్రమోదీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సీడీఎస్ వ్యవస్థను తీసుకొచ్చారు. 2020 జనవరి 1న జనరల్ బిపిన్ రావత్​ భారత దేశ తొలి సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టారు. అయితే గతేడాది డిసెంబర్ లో తమిళనాడులోని కూనూర్​ సమీపంలో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో రావత్ మరణించిన విషయం తెలిసిందే. బిపిన్‌ రావత్‌ మరణానంతరం దాదాపు 9 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు అనిల్‌ చౌహాన్‌ను ఎంపిక చేసినట్టు బుధవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణశాఖ, మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ అనిల్ చౌహాన్‌ వ్యవహరిస్తారని ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Indian Army, Indian Navy

ఉత్తమ కథలు