ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వంటగ్యాస్ డెలివరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. వినియోగదారులు బుకింగ్ చేసుకున్న రోజే వంటగ్యాస్ డెలివరీ చేసే విధంగా సన్నాహాలు మెుదలుపెట్టింది. తత్కాల్ ఎల్పీజీ సర్వీస్ పేరిట ఈ సేవలను అందుబాటులో తీసుకురానున్నట్లు ఐఓసీ అధికారి ఒకరు తెలిపారు. " రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతలలో ప్రత్యేకంగా ఎంపీక చేసిన ప్రాంతాలో తత్కాల్ ఎల్పీజీ సేవలు అందిస్తాం. ఈ పథకం కింద బుక్ చేసుకున్న వినియోగదారుడికి 30-45 నిమిషాల్లోనే గ్యాస్ సరఫరా చేయబడుతుందని" ఆ అధికారి తెలిపారు.
దేశ ప్రజలకు ‘సులభతర జీవనం’ అందించాలన్నా కేంద్రం ఆలోచనలో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. తత్కాల్ వంటగ్యాస్ సేవలను ఫిబ్రవరి 1 లోపు ప్రారంభించాలని కేంద్రం ఆలోచిస్తోంది. అయితే ఈ సేవలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంది. ఇండేన్ బ్రాండ్ పేరిట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వినియోగదారులకు వంట గ్యాస్ పంపిణీ చెస్తోంది. ప్రస్తుతం దేశంలో ఈ సేవను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య 14 కోట్ల మంది ఉన్నారు.
వంటగ్యాస్‌పై క్యాష్ బ్యాక్ పోదండి ఇలా...
పాకెట్స్ వాలెట్ ప్రకారం... గ్యాస్ బుకింగ్‌ను మీరు ఏ మొబైల్ నంబర్ ద్వారా చేపడతారో... అదే నంబర్‌కి క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. అంటే... గ్యాస్ బుకింగ్ ఎవరి పేరు మీద ఉంటే... వారు తమ మొబైల్లో ఈ యాప్ ద్వారా గ్యాస్ బండను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరిలో మొదటిసారి ఈ యాప్ వాడేవారికి ఈ ఆఫర్ లభిస్తుంది. మీరు క్యాష్ బ్యాక్ పొందేందుకు బండను బుక్ చేసుకునే సమయంలో... ప్రోమో కోడ్ PMRJAN2021 ను ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ 2021 జనవరి 25 వరకూ అమల్లో ఉంటుంది. ఈ ప్రోమో కోడ్‌ని నెలకు మూడుసార్లు వాడవచ్చు.
గ్యాస్ సిలిండర్ ఇలా బుక్ చెయ్యండి:
- ముందుగా పాకెట్స్ వాలెట్ యాప్ (Pockets Wallet app) డౌన్లోడ్ చేసుకోండి.
- యాప్ ఇన్స్టాల్ అయ్యాక... ఓపెన్ చెయ్యండి.
- పే బిల్స్ (Pay Bills) అనే ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
- అక్కడ మీకు మోర్ (More) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చెయ్యండి.
- అక్కడ మీకు గ్యాస్ బుకింగ్ ఆప్షన్ (LPG option) కనిపిస్తుంది.
- అక్కడ మీరు మీ గ్యాస్ బండ సర్వీస్ అందించే కంపెనీని ఎంచుకోవాలి.
- ఆ తర్వాత వినియోగదారుడి నంబర్, డిస్ట్రిబ్యూటర్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చెయ్యాలి.
- తర్వాత PMRJAN2021 ప్రోమో కోడ్ ఎంటర్ చెయ్యాలి.
- దీంతో మీకు గ్యాస్ బండ బుకింగ్ జరుగుతుంది.
- ఇప్పుడు మీరు బుకింగ్ అమౌంట్ చెల్లించాలి.
- ఆ తర్వాత మీకు రూ.50 క్యాష్ బ్యాక్ కింద... డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. 10 రోజుల్లో ఈ డబ్బు జమ అవుతుంది.