ఢిల్లీలో భూ ప్రకంపనలు... నెలలో మూడోసారి

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ మీద 3.5గా తీవ్రత నమోదైంది.

  • Share this:
    ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ మీద 3.5గా తీవ్రత నమోదైంది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం కానీ నమోదు కాలేదు. నెల రోజుల వ్యవధిలో ఢిల్లీలో భూ ప్రకంపనలు రావడం ఇది మూడోసారి. ఏప్రిల్ 12న ఒకసారి భూ ప్రకంపనలు వచ్చాయి. అప్పుడు కూడా రిక్టర్ స్కేల్ మీద 3.5గా తీవ్రత నమోదైంది. ఈశాన్య ఢిల్లీలోని వజీరాబాద్‌లో భూమికి 8 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రంగా గుర్తించారు. అయితే, ఆ తర్వాత రోజు కూడా మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. అప్పుడు తీవ్రత 2.7గా నమోదైంది. మూడుసార్లూ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదు. ఈరోజు వచ్చిన భూకంపం 1.26 గంటలకు వచ్చింది. భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టుగా అంచనా.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: