హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Love Story : ప్రియుడితో లేచిపోతున్న కూతుర్ని పట్టుకున్న తల్లి..ట్విస్ట్ అదిరిపోయిందిగా

Love Story : ప్రియుడితో లేచిపోతున్న కూతుర్ని పట్టుకున్న తల్లి..ట్విస్ట్ అదిరిపోయిందిగా

ఆ ప్రేమికులు వీళ్లే

ఆ ప్రేమికులు వీళ్లే

Love Story : బీహార్(Bihar) రాజధాని పాట్నా శివార్లలోని దానాపూర్‌(Danapur) లో ఓ అద్భుతమైన ప్రేమ కథ తెరపైకి వచ్చింది. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఆమె వారిని వెంబడించి కొంతదూరం వెళ్లి ఇద్దరినీ పట్టుకుంది.

ఇంకా చదవండి ...

Love Story : బీహార్(Bihar) రాజధాని పాట్నా శివార్లలోని దానాపూర్‌(Danapur) లో ఓ అద్భుతమైన ప్రేమ కథ తెరపైకి వచ్చింది. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఆమె వారిని వెంబడించి కొంతదూరం వెళ్లి ఇద్దరినీ పట్టుకుంది. ప్రియురాలి తల్లి బిగ్గరగా అరవడం ప్రారంభించింది, దీంతో గ్రామస్థులు గుమిగూడారు. ప్రేమ జంటను ఇదేంటని ప్రశ్నించగా...తామిద్దరం పెళ్లి చేసుకోవాలనే కోరికను వారు బహిరంగంగా వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు అతనికి సమీపంలోని ఓ గుడిలో పెళ్లి చేశారు. ఈ సందర్భంగా బాలిక తల్లి కూడా వివాహానికి సాక్షిగా నిలిచింది. ఈ పెళ్లి మొత్తం లాక్‌లో చర్చనీయాంశమైంది.

కర్పి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్ఖెడా గ్రామానికి చెందిన సత్యేంద్ర పండిట్ కుమారుడు అనిల్ అర్వాల్.. పాట్నా జిల్లా ఖేరిమోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడి హర గ్రామానికి చెందిన యోగేంద్ర పండిట్ కుమార్తె ఇందు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం ఓ వివాహ వేడుక సమయంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి మధ్య స్నేహం మొదలైంది. స్నేహం తర్వాత ప్రేమగా చిగురించింది. పెళ్లి చేసుకొని జీవితాంతం ఒకరికొకరుగా కలిసి ఉండాలని అనిల్-ఇందూ నిర్ణయించుకున్నారు. అయితే వీరిద్దరూ తమ తమ ఇళ్లల్లో ప్రేమ విషయం గురించి చెప్పారు. అయిత వీరి ప్రేమ,పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్లి చేసుకోవాలని అనిల్-ఇందూ నిర్ణయించుకున్నారు. ఫ్లాన్ లో భాగంగా ఆదివారం ప్రియుడు అనిల్..ప్రియురాలు ఇందూ ఇంటికి చేరుకున్నాడు. అయితే వీరిద్దరూ కలిసి పారిపోతుండటాన్ని చూసిన ఇందూ తల్లి వారిని వెంబడించింది. ఇందు తల్లి ఇద్దరినీ పట్టుకుని అరవడం మొదలుపెట్టింది. దీంతో గ్రామస్తులు అక్కడ గుమిగూడారు. అనిల్, ఇందులను గ్రామస్తులు పట్టుకున్నారు. ఇద్దరి కోరికలు తెలుసుకొని గ్రామంలోని ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి సాక్షిగా సంప్రదాయబద్ధంగా వారి వివాహం జరిపించారు. వివాహానంతరం వారిద్దరినీ గ్రామస్థులు ఎంతో ఉత్సాహంగా పంపించారు. వీరి ప్రేమ వ్యహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

Miss India 2022 Winner: మిస్ ఇండియా కిరీటం గెట్చుకున్న సిని శెట్టి..ఆన్నం తింటుందా లేక అందం తింటుందా!

మరోవైపు,తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ (Software Engineer) నారాయణరెడ్డి (25)ని హత్య చేశారు (Brutally murder) దుండగులు. హత్య అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు శవం మాత్రం సగమే కాలినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని కేపీహెచ్​బీ (KPHB) కాలనీ రోడ్డు నంబర్ 1లో నారాయణరెడ్డి తన స్నేహితుడితో కలిసి నివసిస్తున్నారు. ఏడాది క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా యువతి, నారాయణరెడ్డి ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు.. అతడిపై కోపం పెంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నారాయణ రెడ్డి కనిపించలేదు. గత కొద్దిరోజులుగా నారాయణ రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో జూన్ 30న కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. నారాయణ రెడ్డి కాల్ డేటా ఆధారంగా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీనివాసరెడ్డితో నారాయణరెడ్డికి ముందే పరిచయం ఉండటంతో జూన్ 29న వాళ్లిద్దరితో పాటు మరికొంతమంది ఖాజాగూడ వద్ద ఓ వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి ఓ చోట తాగారు. అనంతరం నారాయణరెడ్డిని గొంతు నులిమి హతమార్చి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పంటిచారు శ్రీనివాస్​రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చాయి.

First published:

Tags: Bihar, Lovers

ఉత్తమ కథలు