హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

యువకుడికి కాన్పూర్ కోర్టు జైలు శిక్ష, జరిమానా.. ఇది లవ్ జిహాద్ కేసు కాదు..

యువకుడికి కాన్పూర్ కోర్టు జైలు శిక్ష, జరిమానా.. ఇది లవ్ జిహాద్ కేసు కాదు..

2. దీంతో కాస్త అసహనానికి గురైన న్యాయమూర్తి సదరు పోలీసు అధికారికి వినూత్నంగా శిక్ష విధించారు. ఈ సం ఘటన గుజరాత్ హైకోర్టులో వర్చువల్ విచారణ సమయంలో జ‌రిగింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

2. దీంతో కాస్త అసహనానికి గురైన న్యాయమూర్తి సదరు పోలీసు అధికారికి వినూత్నంగా శిక్ష విధించారు. ఈ సం ఘటన గుజరాత్ హైకోర్టులో వర్చువల్ విచారణ సమయంలో జ‌రిగింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ (Uttar Pradesh)లో ‘లవ్ జిహాద్’ చట్టం కింద తొలిసారిగా కాన్పూర్ యువకుడికి 10 ఏళ్ల జైలు, రూ.30,000 జరిమానా విధించారనే వార్త న్యూస్ 18 తెలుగు వెబ్ సైట్ లో డిసెంబర్ 22న ఓ వార్త ప్రచురితమైంది.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ (Uttar Pradesh)లో ‘లవ్ జిహాద్’ చట్టం కింద తొలిసారిగా కాన్పూర్ యువకుడికి 10 ఏళ్ల జైలు, రూ.30,000 జరిమానా విధించారనే వార్త న్యూస్ 18 తెలుగు వెబ్ సైట్ లో డిసెంబర్ 22న ఓ వార్త ప్రచురితమైంది. ఇది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన లవ్ జిహాద్ చట్టం కింద వెలువడిన తొలి తీర్పు అని తప్పుగా ప్రచురితమైంది. ఈ కేసు లవ్ జిహాద్ కింద వర్తించదు. 

జావేద్ అనే యువకుడు తనను తాను మైనర్‌కు మున్నాగా పరిచయం చేసుకున్నాడు. ఆమెను వివాహం (Marriage) చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మరుసటి రోజు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె అబ్బాయి ఇంటికి చేరుకున్నప్పుడు అత‌ను మున్నా కాదు జావేద్ అని తెలిసింద‌ని అమ్మాయి తెలిపింది. నిఖా చేసుకోవాల‌ని అడిగాడ‌ని అమ్మాయి తెలిపింది. ఇందుకు అమ్మాయి నిరాక‌రించింది. అన‌ంత‌రం అమ్మాయిపై ప‌లువురు యువకులు అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఆమె ఆరోపించింది.

ఈ కేసులో నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఈ కేసుపై విచార‌ణ చేసిన పోలీసులు వివ‌రాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు. దీనిపై కోర్టు తీర్పు వెల్ల‌డించింది. నిందితుడికి ప‌ది సంవ‌త్స‌రాలు జైలు, రూ.30,000 జ‌రిమానా విధించారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాద్ చట్టాన్ని 2020లో మొదటిసారి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది, 2021లో చట్టం చేసింది. ఐతే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వైరల్ అవుతున్న కేసు 2017లో జరిగిన అత్యాచారానికి సంబంధించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1) ప్రకారం, కొత్తగా రూపొందించిన చట్టాల కింద గతంలో జరిగిన నేరాలను విచారించడంగాని, శిక్షించడంగాని జరగదు. దీన్నిబట్టి, ఈ కేసుకి లవ్ జిహాద్ చట్టం వర్తించదు. (Source: Factly) 

First published:

Tags: Cheating case, Marriage, Uttar pradesh

ఉత్తమ కథలు