Home /News /national /

LOVE IS BLIND AND STRONGER THAN LOVE FOR PARENTS AND SOCIETY SAYS KARNATAKA HIGH COURT PVN

High Court On Love: ఔను ప్రేమ గుడ్డిదే..ఆ ప్రేమికుల కేసులో హైకోర్టు తీర్పుతో తల్లిదండ్రులకు కన్నీళ్లే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka High Court On Love : ప్రేమ(Love) అనేది ఒక భావన. దీన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అనుభూతి చెందుతారు. ఒక్కసారి ప్రేమను ఫీల్ అయిన తర్వాత, ఆ అనుభూతిని మర్చిపోలేం. మనం ఎంత ఎక్కువ ప్రేమను పొందినా, అంతకంటే ఇంకా ఎక్కువ ప్రేమ కావాలని కోరుకుంటాం. ప్రేమే మనల్ని బతికిస్తోందని చాలామంది నమ్ముతారు. జీవితాంతం ఇలాంటి ప్రేమ కావాలని చాలామంది కోరుకుంటారు.

ఇంకా చదవండి ...
Karnataka High Court On Love : ప్రేమ(Love) అనేది ఒక భావన. దీన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అనుభూతి చెందుతారు. ఒక్కసారి ప్రేమను ఫీల్ అయిన తర్వాత, ఆ అనుభూతిని మర్చిపోలేం. మనం ఎంత ఎక్కువ ప్రేమను పొందినా, అంతకంటే ఇంకా ఎక్కువ ప్రేమ కావాలని కోరుకుంటాం. ప్రేమే మనల్ని బతికిస్తోందని చాలామంది నమ్ముతారు. జీవితాంతం ఇలాంటి ప్రేమ కావాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఇది అందరికీ దొరకదు. ప్రేమ కోసం ప్రతిఒక్కరూ ఎదురు చూడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ ఫీలింగ్ ప్రజల సంతోషానికి(Happiness) అవసరమైన ముఖ్యమైన అనుభూతి అని నిపుణులు చెబుతున్నారు. ప్రేమ ఆనందంతో పాటు శ్రేయస్సుకు కారణమవుతుందని చాలామంది భావిస్తారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందాన్ని కోరుకుంటారు. మన లోపల ఉన్న భావాలు, అనుభూతులు.. మనం బతికినంత కాలం ప్రేమ రూపంలో ఆనందాన్నిస్తాయి. అందుకే సంపూర్ణమైన జీవితానికి ప్రేమ తప్పకుండా ఉండాల్సిందేనని ప్రేమికులు బలంగా కోరుకుంటారు. ప్రేమ కేవలం రొమాంటిక్ పార్ట్నర్‌ నుంచి మాత్రమే రాదు. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసినవారి నుంచి కూడా రావచ్చు. ప్రేమకు ఎంతోమంది ఎన్నో విధాలుగా నిర్వచనాలు ఇచ్చారు. కానీ ఎవరూ దీన్ని పూర్తిగా నిర్వచించలేరు. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత అపార్థం చేసుకునే అంశాల్లో ప్రేమ ఒకటిగా ఉంది.

అయితే ప్రేమపై కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ కేసులో హైకోర్టు ప్రేమపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.ప్రేమ గుడ్డిదని, తల్లిదండ్రులు, సమాజం కన్నా ప్రేమే దృఢమైదని ప్రేమికులు(Lovers) భావిస్తుంటారని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. పిల్లల కోసం తల్లిదండ్రులు అనేక త్యాగాలు చేస్తారని ..యువతీ యువకుల మధ్య ప్రేమ తల్లిదండ్రులను(Parents) బాధించేలా ఉండకూడదని హితవు పలికింది.

Air Pollution : భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు కట్..ఢిల్లీలో ఉండేవాళ్లకైతే 10 ఏళ్లు!

కర్ణాటక(Karnataka)రాష్ట్రానికి చెందిన నిసర్గ అనే యువతి..ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే చదువుతున్న సమయంలో నిఖిల్‌ అనే డ్రైవర్ ని ప్రేమించింది. కొద్ది రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ గాఢంగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించరని భావించిన నిసర్గ..ఇంట్లో నుంచి వెళ్లిపోయి నిఖిల్‌ను పెళ్లి చేసుకుంది. ఇంజినీరింగ్‌ చదువుతున్న తన కుమార్తె నిసర్గను.. నిఖిల్‌ అలియాస్‌ అభి అనే డ్రైవర్ అపహరించుకు వెళ్లాడని ఆరోపిస్తూ ఆమె తండ్రి టి ఎల్‌ నాగరాజు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నిసర్గ, నిఖిల్‌ ఇద్దరినీ పోలీసులు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు. జస్టిస్‌ బి.వీరప్ప, జస్టిస్‌ కె.ఎస్‌.హేమలత నే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.

Honour Killing : పెళ్లైన ఐదు రోజులకు దంపతులను దారుణంగా నరికి చంపేశారు

తాను తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్‌తో ఇష్టపూర్వకంగా వెళ్లానని, తాను మేజర్‌ను అని, ఇద్దరం ఇష్టపడి మే 13న వివాహం చేసుకున్నామని నిసర్గ కోర్టుకి తెలిపింది. తాను తనతో పాటు ఉన్న వ్యక్తితోనే ఉంటానని.. తన తల్లితండ్రులతో వెళ్లేందుకు సిద్ధంగా లేనని చెప్పింది. కేసు వివరాలు చూసిన తర్వాత,వాదనలు విన్న తర్వాత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిజంగానే ప్రేమ గుడ్డిదని, అది తల్లితండ్రుల ప్రేమ కన్నా కూడా సమాజం చూపించే ప్రేమ కన్నా కూడా ధృఢమైనదని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. పలువురు తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం జీవితాలను, సుఖాలను త్యాగం చేశారని చరిత్ర చెబుతోందిని.. ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఉన్నా అవి కుటుంబాన్ని బాధించేలా ఉండకూడదని ధర్మాసనం తెలిపింది.తల్లిదండ్రులు తమ పిల్లలకు నష్టం చేసేలా వ్యవహరించరని.. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు కష్టం చేయాలని అనుకోరని తెలిపింది. ప్రేమికులు తమ కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తవు అని న్యాయమూర్తులు స్పందించారు. ఇప్పుడు కుటుంబాన్ని వదిలి వెళ్తే... భవిష్యత్తులో మళ్లీ తల్లిదండ్రుల అవసరం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని నిసర్గకు ధర్మాసనం హితవు పలికింది. అలాగే,ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నా.. కుమార్తె యోగక్షేమాలు విచారించే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: High Court, Karnataka, Love, Lovers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు