బెంగళూరులో భారీ వింత శబ్దాలు.. అదే కారణమా..?

ప్రతీకాత్మక చిత్రం

మరికొందరేమో మేఘాల్లో విస్పోటనం సంభవించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వింత శబ్దాలపై మరింత గందరగోళం నెలకొంది. అసలు ఎలా వచ్చాయన్న దానిపై క్లారిటీ కొరవడింది.

 • Share this:
  బుధవారం మధ్యాహ్నం బెంగళూరు వాసులు ఉలిక్కిపడ్డారు. ఆకాశంలో భారీ వింత శబ్దాలు వినిపిండచంతో భయపడిపోయారు. సర్జాపూర్, హెచ్ఎస్ఆర్, వైట్ ఫీల్డ్, హెబ్బాల్ ప్రాంతాల్లో పెద్దగా శబ్దాలు రావడంతో జనం ఇళ్ల నుంచి పరుగులు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెబ్బగోడి వరకు ఆ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. భూకంపం వచ్చిందేమోనని గజాగజా వణికిపోయారు. కానీ బయటకొచ్చి చూస్తే అంతా బాగానే ఉంది. కానీ ఆ శబ్దాలు ఎలా వచ్చాయో అర్థం కాలేదు. సెస్మో మీటర్‌లో భూప్రకంపనలేవీ రికార్డు కాలేదని కర్నాటక రాష్ట్ర విపత్త నిర్వహణ కేంద్రం తెలిపింది.


  అసలా శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు వచ్చాయని చర్చ జరుగుతున్న వేళ.. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఓ ప్రకటన చేసింది. సుఖోయ్ 30 యుద్ధ విమానం వల్లే ఆ శబ్దాలు వచ్చాయని తెలిపింది. హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టు నుంచి 90 డిగ్రీల కోణంలో విమానం టేకాఫ్ అవుతుండగా భారీ శబ్దాలు వచ్చాయని వెల్లడించింది. ఐతే HAL సంస్థకు చెందిన సిబ్బంది వాదన మాత్రం మరోలా ఉంది. అది సుఖోయ్ 30 విమానాల వచ్చిన శబ్దాల్లా లేవని.. ఏదో భారీ పేలుడు వచ్చినట్లుగా ఉందని చెప్పారు. ఒకవేళ విమానం నుంచే వచ్చిందనుకున్న.. ఈ విమానాన్ని HAL ఆపరేట్ చేయలేదని, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నడిపి ఉంటుందని తెలిపారు. మరికొందరేమో మేఘాల్లో విస్పోటనం సంభవించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వింత శబ్దాలపై మరింత గందరగోళం నెలకొంది. అసలు ఎలా వచ్చాయన్న దానిపై క్లారిటీ కొరవడింది.
  HAL cleared the speculations and said the loud noise was caused due to Sukhoi 30 fighter jet. The officials said the sound was heard while the fighter jet was taking off at 90-degree at the HAL airport runway.
  Published by:Shiva Kumar Addula
  First published: