హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పాస్‌పోర్ట్‌లపై కమలం గుర్తు.. అందుకే అంటూ కేంద్రం వివరణ

పాస్‌పోర్ట్‌లపై కమలం గుర్తు.. అందుకే అంటూ కేంద్రం వివరణ

ఇతర జాతీయ చిహ్నాలు (జాతీయ పుష్పం, జాతీయ జంతువు,జాతీయ వృక్షం)ను కూడా రొటేషనల్ పద్దతుల్లో పాస్‌పోర్టులపై ముద్రిస్తామని స్పష్టం చేశారు రవీశ్.

    దేశంలో కొత్త పాస్‌పోర్ట్‌లపై కమలం గుర్తును ముద్రించడంపై దుమారం రేగింది. ఈ అంశంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. కమలం బీజేపీ పార్టీ గుర్తైనందున దాన్ని ప్రచారం చేసేకునేందుకు పాస్‌పోర్టులను వాడుకుంటోందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు కలిగి ఉన్న పాస్‌పోర్టులను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ లోక్‌సభ జీరో అవర్‌లో లేవనెత్తారు.

    ఈ అంశంపై సభలో కేంద్రం వివరణ ఇచ్చింది. పాస్‌పోర్టుపై ఉన్న కమలం గుర్తుపై కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి రవీశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. సెక్యూటరీ ఫీచర్స్‌లో భాగంగానే కమలం గుర్తును జోడించామని స్పష్టం చేశారు. కమలం జాతీయ చిహ్నమని.. నకిలీ పాస్‌పోర్టులను గుర్తించేందుకు భద్రతా చర్యల్లో భాగంగా కమలం గుర్తును పొందుపరిచామని వెల్లడించారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇతర జాతీయ చిహ్నాలు (జాతీయ పుష్పం, జాతీయ జంతువు,జాతీయ వృక్షం)ను కూడా రొటేషనల్ పద్దతుల్లో పాస్‌పోర్టులపై ముద్రిస్తామని స్పష్టం చేశారు రవీశ్.

    First published:

    Tags: Passport

    ఉత్తమ కథలు