ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత

పార్లమెంట్ (File)

ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్‌ను లోక్‌సభ స్పీకర్ ఎత్తివేశారు. ఈ మేరకు తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. 

  • Share this:
    ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్‌ను లోక్‌సభ స్పీకర్ ఎత్తివేశారు. ఈ మేరకు తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీల మీద లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా సస్పెన్షన్ ఈనెల 5వ తేదీన వేటు వేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు వారిని సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియకోస్, ఆర్ ఉన్నితన్, మాణిక్యం ఠాగూర్, బెన్నీ బెహ్నన్, గుర్జీత్ సింగ్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. సభలో అనుచితంగా ప్రవర్తించారంటూ వారిపై వేటు వేశారు. ఈనెల 11న ప్రభుత్వం సమాధానం చెబుతుందని చెప్పినా వినకుండా ఎంపీలు పెద్ద ఎత్తున సభకు ఆటంకం కలిగిస్తున్నారని ఆగ్రహించిన ప్రభుత్వం వారిపై సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. వారిని బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసింది. అయితే, ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ అల్లర్ల మీద సభలో వివరణ ఇచ్చారు. ప్రభుత్వం సమాధానం చెప్పడంతో ఢిల్లీ అల్లర్ల మీద చర్చ ముగిసింది కాబట్టి కాంగ్రెస్ ఎంపీల మీద సస్పెన్షన్‌ను తొలగించాలని ప్రతిపాదన వచ్చింది. దీంతో లోక్ సభలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ఆమోదం తెలపడంతో ఏడుగురు ఎంపీలపై సస్పెన్షన్ తొలగిపోయింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: