ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

లోక్‌సభ (File)

Triple Talaq | ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 303 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 82 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ వాకౌట్ చేశాయి.

  • Share this:
    ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనిపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుపై ఓటింగ్‌కు ముందు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీ అయిన జేడీయూ కూడా వాకౌట్ చేశాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 303 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 82 ఓట్లు పడ్డాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సదర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. జూలై 24 నాటికి దేశంలో 345 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆ బాధిత మహిళలను రోడ్డున వదిలేద్దామా? అని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును కొందరు మతం పరంగా చూస్తున్నారని, ఇది మతానికి సంబంధం లేని, మహిళలకు హక్కులు కల్పించే బిల్లుగా అభివర్ణించారు. 1986లో కాంగ్రెస్ తీసుకున్న నిర్నయం వల్ల దేశవ్యాప్తంగా ఎంతో మంది బాధపడుతున్నారని మరో కేంద్ర మంత్రి నఖ్వీ అన్నారు.

    ట్రిపుల్ తలాక్ మీద చట్టాన్ని తీసుకురావాలంటూ 2017లో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లును తయారు చేసింది. కొత్త బిల్లు ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పిన వారు శిక్షార్హులు. ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు ప్రతిపాదించాయి. అయితే, వాటిని అధికారపక్షం కొట్టిపారేసింది. మరోవైపు ఆగస్ట్ 7 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పొడిగించారు. కొన్ని బిల్లులను చర్చించి ఆమోదింపజేసుకునేందుకు అనువుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: