పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం...

Citizenship Amendment Bill : 12 గంటలపాటూ సాగిన సుదీర్ఘ చర్చ తర్వాత... కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదింపజేసుకుంది.

news18-telugu
Updated: December 10, 2019, 5:26 AM IST
పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Citizenship Amendment Bill : సోమవారమే పౌరసత్వ (సవరణ) బిల్లును ఆమోదించేలా చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. సుదీర్ఘంగా 12 గంటల పాటు చర్చ సాగిన తర్వాత... పౌరసత్వ బిల్లును లోక్ సభ ఆమోదించింది. సభలో మొత్తం 391 ఓట్లు పోలవగా, బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఒక్కో సవరణకూ ఓటింగ్ తీసుకున్న స్పీకర్ బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పౌరసత్వ సవరణ బిల్లు ఏంటి అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జనరల్‌గా భారతీయులందరికీ పౌరులుగా పౌరసత్వం ఉంటుంది. ఐతే కేంద్ర ప్రభుత్వం... పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు, వివక్షలూ తట్టుకోలేక 2014 డిసెంబర్ ఆఖరులోపు దేశంలోకి వలస వచ్చిన... ముస్లింలు కాని వారికి పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ బిల్లులో సవరణలు చేసింది. ఆ బిల్లును హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో సోమవారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ జరిపి... తర్వాత ఓటింగ్‌ నిర్వహించారు. ఐతే ఈ బిల్లును కాంగ్రెస్, టీఆర్ఎస్, MIM సహా కొన్ని పార్టీలు తప్పు పట్టాయి. పౌరసత్వం పేరుతో ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శి్ంచింది. MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా బిల్లు ప్రతులను లోక్‌సభలోనే చించి వేసి తన నిరసన తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాను. మేమూ మనుషులమే. ఈ వివక్షకు కారణమేంటి? అస్సాం NRCలో 19 లక్షల మంది పేర్లు లేవు. ముస్లింలకు స్వదేశమంటూ లేకుండా చేస్తున్నారు. రెండోసారి విభజన జరగాలనుకుంటున్నారా? ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అంటూ ప్రతిని చించేశారు ఒవైసీ.

asaduddin,asaduddin owaisi,asaduddin owaisi on citizenship amendment bill,పౌరసత్వ సవరణ బిల్లు,లోక్‌సభలో పేపర్లు చించేసిన అసదుద్దీన్ ఒవైసీ,
పౌరసత్వ సవరణ బిల్లు పేపర్లు చించేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ


మతాలకు అతీతంగా దేశంలోకి వచ్చిన అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపేందుకు 1971 మార్చి 24న తుది గడువుగా నిర్దేశిస్తూ కేంద్రం, ఈశాన్య రాష్ర్టాల మధ్య 1985లో కుదిరిన అసోం ఒప్పందాన్ని ఈ సవరణ బిల్లు కాలరాస్తోందన్నది ఈశాన్య రాష్ట్రాల ప్రజల వాదన. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నేడు బంద్‌‌కి పిలుపిచ్చింది ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల సమాఖ్య. మొత్తంగా బిల్లును లోక్ సభ ఆమోదించడంతో కేంద్రం ఊపిరి పీల్చుకుంది. నెక్ట్స్ రాజ్యసభలోనూ ఆమోదింపజేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.


Pics : ఐస్‌తో ఐస్ చేస్తున్న కేరళ బ్యూటీ ప్రియాంక
ఇవి కూడా చదవండి :

పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు


Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు


పాము కనిపిస్తే అది విషపూరితమైనదో కాదో గుర్తించడం ఎలా?
Published by: Krishna Kumar N
First published: December 10, 2019, 5:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading