లోక్‌సభ మిషన్ కంప్లీట్.. బీజేపీ తర్వాత టార్గెట్ ఇదే..

ప్రధాని నరేంద్ర మోదీ

ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి భారీ మెజారిటీ వస్తే 2020 నవంబర్ నాటికి మరింత జోష్ వస్తుంది.

  • Share this:
    లోక్‌సభ మిషన్ విజయవంతంగా పూర్తయింది. బీజేపీ తర్వాత టార్గెట్ కూడా ఫిక్సయింది. అదే రాజ్యసభ. పార్లమెంట్ పెద్దల సభలో మెజారిటీ సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయనుంది. రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో బీజేపీకి తలనొప్పిగా మారింది. బీజేపీ ప్రభుత్వం అనుకున్న బిల్లులకు రాజ్యసభలో బ్రేక్ పడుతుంది. ట్రిపుల్ తలాక్ బిల్లు, మోటారు వాహనాల చట్టం, పౌరసత్వం చట్టానికి సవరణలు వంటి అంశాల్లో ఎన్డీయేకు రాజ్యసభలో చుక్కెదురవుతోంది. రాజ్యసభలో సరైన సంఖ్యాబలం లేకపోవడంతో కమలదళానికి ఈ పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రాజ్యసభలో కూడా మెజారిటీ సాధించేందుకు ఈసారి బీజేపీ నడుం బిగిస్తోంది.

    రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉంటారు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీని దాటి 101 సీట్లు సాధించింది ఎన్డీయే. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు, మరో ముగ్గురు స్వతంత్రుల మద్దతు కూడా ఆ పార్టీకి ఉంది. కాబట్టి సంఖ్యాబలం 107కి చేరుతుంది. యూపీఏ హయాంలో నామినేట్ చేసిన కేటీఎస్ తులసీ పదవీకాలం వచ్చే ఏడాదిలో ముగియనుంది. దీంతో బీజేపీ తనకు నచ్చిన వారిని నామినేట్ చేసుకోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే, 2020 నవంబర్ నాటికి 14 రాష్ట్రాల నుంచి మరో 19 మంది బీజేపీ ఎంపీలు రాజ్యసభలో అడుగుపెడతారు. అప్పటికి ఎన్డీయే సంఖ్యాబలం 125కి చేరుతుంది. అంటే మెజారిటీ 123 కంటే రెండు సీట్లు ఎక్కువే అన్నమాట.

    ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి భారీ మెజారిటీ వస్తే 2020 నవంబర్ నాటికి మరింత జోష్ వస్తుంది.
    First published: