రూ.50 వేల కోట్లు... ఎన్నికల కోసం ఈసీ పెడుతున్న ఖర్చు

నిజామాబాద్ లోక్‌సభ బరిలో మొత్తం 185 మంది అభ్యర్థులు ఉన్నారు.

Lok Sabha Elections 2019 : ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవే అని మరోసారి రికార్డ్ సృష్టించబోతున్నాం.

  • Share this:
మన దేశంలో జనాభా ఎక్కువ. ఎంత ఎలక్ట్రానిక్ ఓటింగ్ తెచ్చినా... ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు మాత్రం ప్రతిసారీ పెరుగుతూనే ఉంది. ఈ ఖర్చుతో పార్టీలు, అభ్యర్థులకూ సంబంధం లేదు. ఇది కేవలం ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం చేయిస్తున్న ఖర్చు మాత్రమే. 130 కోట్ల మంది ప్రజలు, వాళ్ల కోసం లక్షల సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు, వాటి కోసం ఎన్నికల అధికారులు, సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, మౌలిక సదుపాయాలు, రవాణా, అవగాహనా కార్యక్రమాలు ఇవన్నీ కలిసి... ఎన్నికల నిర్వహణ అంటేనే వేల కోట్లతో పని అనేలా చేశాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే. దానికి తగ్గట్టే ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవే. ఈసారి ఆ ఖర్చు మరింత పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశం.

ఏప్రిల్ 11న తొలి దశతో మొదలయ్యే ఎన్నికలు... ఏకంగా 7 దశల్లో కొనసాగి... చివరకు మే 23న ఫలితాలు వెల్లడి చెయ్యడంతో ముగుస్తాయి. నిజానికి అదే తేదీతో ముగుస్తాయని చెప్పడానికి లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల రిగ్గింగులు జరగవచ్చు, మావోయిస్టుల దాడులు జరగొచ్చు, గొడవలు జరగొచ్చు. ఇలా ఏమైనా అయితే... ఆ యా పోలింగ్ కేంద్రాల దగ్గర రీ పోలింగ్ జరపాల్సి రావచ్చు. ఇవి అదనంగా అయ్యే ఖర్చులు.

2014లో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.34వేల కోట్లు ఖర్చయ్యాయి. ఈసారి ఖర్చు 40 శాతం పెరగబోతోంది. మొత్తం 50 వేల కోట్లు అవుతుందని అంచనా. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అయిన ఖర్చు రూ.45 వేల కోట్ల రూపాయలు. మన దేశంలో ఎన్నికల ఖర్చు... దానికంటే మించిపోబోతోంది.

 

ఇవి కూడా చదవండి :

టీడీపీ, వైపీసీ, జనసేన తొలి జాబితాలు రెడీ... నేడు రిలీజ్?

నేతల జంపింగ్ జపాంగ్... తాజాగా ఎవరు ఏ పార్టీల్లోకి...

Ind vs Aus 5th ODI : ఢిల్లీలో భారత్ ఆస్ట్రేలియా ఐదో వన్డే... గెలిచిన జట్టుదే సిరీస్

పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తింటున్నారా... 21 ఆరోగ్య ప్రయోజనాలు
First published: