హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వాడు తమ్ముడు కాదు దుర్యోధనుడు... తేజశ్విని యాదవ్‌పై... తేజ్ ప్రతాప్ యాదవ్ ఫైర్

వాడు తమ్ముడు కాదు దుర్యోధనుడు... తేజశ్విని యాదవ్‌పై... తేజ్ ప్రతాప్ యాదవ్ ఫైర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Lok Sabha Elections 2019 : లాలూప్రసాద్, రబ్రీ దేవికి వ్యతిరేకంగా పోరాడుతున్న తేజ్ ప్రతాప్ యాదవ్... తమ్ముడు తేజశ్విని యాదవ్‌ను టార్గెట్ చెయ్యడం కలకలం రేపుతోంది.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్... ఈమధ్యే లాలూతో విభేదించి... జయప్రకాశ్ జనతాదళ్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ పార్టీ సింబల్‌తోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఒకప్పుడు ఆయన... తన తమ్ముడు తేజశ్విని యాదవ్‌కు అండగా ఉంటూ... NDA ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. అలాంటిది ఇప్పుడు అదే తమ్ముడిని పౌరాణిక పాత్ర దుర్యోధనుడితో పోల్చుతూ... ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. తన చిన్న తమ్ముడి పట్ల తేజ్ ప్రతాప్ యాదవ్ మనసు మారిపోవడానికి కారణం... షియోహార్ లోక్ సభ స్థానానికి RJD తరపున ఆయన బరిలో దిగబోతున్నారన్న సమాచారమే. వాస్తవానికి షియోహార్ సీటుకు తన అనుచరుడైన అగ్నేష్ సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించాలని తేజ్ ప్రతాప్ యాదవ్... లాలూ ప్రసాద్‌ను కోరారు.

మొత్తం ఐదు స్థానాల్లో తనకు నచ్చిన అభ్యర్థుల్ని నిలబెట్టాలని తేజ్ ప్రతాప్... లాలూకు అల్టిమేటం ఇచ్చారు. ఐదింటిలో కనీసం జెహానాబాద్‌ స్థానానికి చంద్రప్రకాష్, షియోహార్‌ సీటుకు అగ్నేష్ సింగ్‌ను బరిలో దింపాలని చివరిగా కోరారు. అవేవీ సాధ్యపడలేదు. అలాగే... తన మావయ్య చంద్రికా రాయ్‌ని సరణ్ స్థానం నుంచీ బరిలో దింపాలని తేజ్ ప్రతాప్ భావిస్తే... ఆ స్థానం... తమ కుటుంబానికి చెందుతుందంటూ... లాలూ ప్రసాద్.... రబ్రీ దేవిని బరిలో దింపుతానని చెప్పడం కూడా తేజ్ ప్రతాప్‌కి రుచించట్లేదు.

తన భార్య ఐశ్వర్యరాయ్‌తో విడాకులకు సంబంధించిన వివాదంతో తేజ్ ప్రతాప్‌... లాలూ ఫ్యామిలీకీ మధ్య దూరం పెరిగింది. లాలూకి వ్యతిరేకంగా పోరాడుతున్న తేజ్ ప్రతాప్... అవసరమైతే సరణ్ నుంచీ ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతాననీ అలాగే... తన మద్దతు దారులు ఐదుగురిని RJD అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలో దింపుతానని తాజాగా వార్నింగ్ ఇచ్చారు. లాలూ ఇవేమీ పట్టించుకున్నట్లు కనిపించకపోవడంతో... తాజాగా తేజ్ ప్రతాప్... జెహానాబాద్ స్థానం నుంచీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి :

మిషన్ శక్తితో శాటిలైట్‌ ఎలా కూలింది... వీడియో రిలీజ్ చేసిన DRDO...

నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల... ఎలా ఉంటుంది... కాంగ్రెస్‌కి షాక్ ఇస్తుందా...

పసుపు కుంకుమ ముసుగులో ఓటర్లకు డబ్బులు... పావులుగా డ్వాక్రా మహిళలు

ఖర్చు తక్కువ... విదేశీ ట్రిప్పులు ఎక్కువ... ప్రధాని మోదీకి ఇదెలా సాధ్యమైంది...

First published:

Tags: Bihar Lok Sabha Elections 2019, Lalu Prasad Yadav, Lok Sabha Election 2019

ఉత్తమ కథలు