అట్టపెట్టెల్లో రూ.20 కోట్లు... సిమెంట్ ఫ్యాక్టరీలో పద్ధతిగా దాచిపెట్టి...

Lok Sabha Elections 2019 : ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడో డబ్బు దొరుకుతోంది. దాన్ని సీజ్ చేస్తున్న అధికారులు... ఇన్‌కంటాక్స్ ఆఫీసుకి తరలిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 1, 2019, 1:30 PM IST
అట్టపెట్టెల్లో రూ.20 కోట్లు... సిమెంట్ ఫ్యాక్టరీలో పద్ధతిగా దాచిపెట్టి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడిలో ఆదాయపన్ను శాఖ (IT) అధికారులు షాకయ్యారు. ఎవరో వారికి సమాచారం ఇచ్చారు... అక్కడ బ్లాక్ మనీ ఉందని. అది ఎంతవరకూ నిజమో తెలియకపోయినా... తనిఖీలు చేద్దామని ఐటీ అధికారులు... DMK కోశాధికారి దురై మురుగన్‌కి చెందిన కాలేజీ, సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లారు. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా గబగబా తనిఖీలు చేశారు. ఫ్యాక్టరీ గోడౌన్‌లో కొన్ని పెద్ద పెద్ద అట్టపెట్టెలు కనిపించాయి. సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ బస్తాలు ఉండాలని కానీ... ఈ అట్టపెట్టలేంటి అని వాటిని కదిపి చూశారు. బరువుగా అనిపించాయి. తెరిచి చూశారు. తళతళలాడే కొత్త 2వేల రూపాయల నోట్లు. అన్నీ పద్ధతి ప్రకారం... డినామినేషన్‌లో ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయో లెక్కగడితే... రూ.20 కోట్లని తేలింది.

ఆ డబ్బు ఎవరిదన్న విషయంపై ఎవరూ మాట్లాడట్లేదు. అది దొరికింది DMK ట్రెజరర్ దురై మురుగన్ ఫ్యాక్టరీలో అయినప్పటికీ... ఆయన మాత్రం... తనకేం సంబంధం లేదనీ... అసలు ఎవరు అక్కడ దాచారో తెలియదని లబోదిబోమంటున్నారు. రూల్ ప్రకారం వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు... కేసు నమోదు చేశారు. నగదును రిజర్వ్‌బ్యాంక్‌కి తరలిస్తున్నట్లు తెలిపారు.

దురై మురుగన్‌ కొడుకు కదిర్ ఆనంద్... దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం నుంచీ డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనే ఎన్నికల కోసం ఈ డబ్బును దాచిపెట్టి ఉంటారని ఐటీ అధికారులు భావిస్తున్నారు.

ఈ దాడులు రాజకీయ కలకలం రేపాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం... తమపై IT, ED, CBI దాడుల పేరుతో కక్ష సాధిస్తోందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. తమకు వచ్చిన సమాచారంతోనే దాడులు చేశామంటున్న అధికారులు... వాటికీ... కేంద్ర ప్రభుత్వానికీ సంబంధం లేదంటున్నారు. అది తమ క్రెడిట్‌గా చెప్పుకుంటున్నారు.ఇవి కూడా చదవండి :

వైసీపీలో చేరిన రాజశేఖర్, జీవిత... టీడీపీ, జనసేన తోడుదొంగలు అంటూ ఫైర్...

రైతుల కోసం శరద్ పవార్ చేసిందేమీ లేదు... మహారాష్ట్రలో మండిపడిన ప్రధానివాయనాడ్‌లో రాహుల్ గెలుపు నల్లేరుపై నడకేనా... లెఫ్ట్ పార్టీలు పోటీ నుంచీ తప్పుకునే అవకాశం...

వైసీపీలో చేరిన రాజశేఖర్, జీవిత... టీడీపీ, జనసేన తోడుదొంగలు అంటూ ఫైర్...
Published by: Krishna Kumar N
First published: April 1, 2019, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading