ఓటు హక్కు వినియోగంపై మునుపటి కంటే జనంలో అవగాహన మరింత పెరిగింది. ఎంతటి అనివార్య స్థితిలో ఉన్నా సరే.. పోలింగ్ రోజు మాత్రం ఓటు వేయడమే తొలి ప్రాధాన్యతగా ఓటర్లు భావిస్తున్నారు. అందుకే పరీక్షలు, పెళ్లిళ్లు, విషాదాలు.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఓటు వేసేందుకు జనం ముందుకు వస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌లో ఓ యువకుడు తండ్రి అంత్యక్రియల అనంతరం నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు.
తండ్రి చనిపోయాడన్న బాధ ఓవైపు వెంటాడుతున్నా.. దు:ఖాన్ని అణుచుకుని ఓటు వేసేందుకు వచ్చాడు. ఓటు విలువ గుర్తెరిగినవాడు కాబట్టే పుట్టెడు దు:ఖంలోనూ ఓటు వేసి ఆ యువకుడు నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఒక్కటే కాదు.. దేశవ్యాప్తంగా అనేక ఘటనలు ఓటర్లకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెరిగిందని నిరూపిస్తున్నాయి. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా పెళ్లి మంటపం నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు వేస్తున్నారు. వృద్దులు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ బూత్‌ల ఎదుట క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. ప్రజల్లో ఓటు హక్కుపై ఇంత అవగాహన ఏర్పడటంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Madhya Pradesh: A man in Chhatarpur arrives to vote, after his father's last rites earlier today. #LokSabhaElections2019 #Phase5 pic.twitter.com/99YoCEJ7Ch
— ANI (@ANI) May 6, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhopal S12p19, Lok Sabha Elections 2019, Madhya Pradesh Lok Sabha Elections 2019