హోటల్లో బయటపడ్డ ఈవీఎంలు, వీవీపాట్‌లు?.. అక్కడికెలా వెళ్లాయి?

ప్రతీకాత్మక చిత్రం

ఎక్కడైనా పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయిస్తే వీటిని ఉపయోగించేందుకు సిద్దంగా ఉంచుకున్నారని చెప్పారు. అయితే ఈవీఎంలను హోటళ్లకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్దమని.. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Share this:
    మరో రెండు విడతల ఎన్నికలు ఇంకా జరగాల్సి ఉండగానే.. ఈవీఎంలు, వీవీపాట్‌లు ఓ హోటల్లో దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. బీహార్‌ ముజఫర్‌పూర్‌లోని ఓ హోటల్లో సోమవారం వీటిని స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ రంజన్ తెలిపారు.అయితే అవి రిజర్వ్డ్ మెషీన్ అని.. ఎక్కడైనా పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయిస్తే వీటిని ఉపయోగించేందుకు సిద్దంగా ఉంచుకున్నారని చెప్పారు. అయినప్పటికీ ఈవీఎంలను హోటళ్లకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్దమని.. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    ఎన్నికల అధికారి అవదేశ్ కుమార్ మాట్లాడుతూ.. స్థానికంగా ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం సాంకేతిక సమస్య తలెత్తిందని చెప్పారు. దాంతో వాటి స్థానంలో వేరేవి ఏర్పాటు చేసి తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో కారు డ్రైవర్ ఓటు వేసేందుకు వెళ్లినట్టు చెప్పారు. దీంతో కారులో ఉన్న ఈవీఎం మెషీన్‌లను భద్రంగా ఉంచడం కోసం హోటల్‌కు తరలించినట్టు చెప్పారు. అయితే ఇలాంటి చర్యలు ఎన్నికల నియమావళికి విరుద్దం కావడంతో అవదేశ్ కుమార్ దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. మరోవైపు హోటల్లో ఈవీఎంలు బయటపడ్డాయన్న విషయం తెలుసుకుని కొంతమంది స్థానికులు అక్కడ ఆందోళన చేపట్టారు.
    First published: