#ButtonDabaoDeshBanao : సార్వత్రిక ఎన్నికలు 2019.. మెరుగైన భారత్ కోసం ఓటు వేయండి..

Lok Sabha Election 2019 : బటన్ దబావో దేశ్ బనావో అనేది, ప్రస్తుతం జరుగుతున్న భారతీయ సాధారణ ఎన్నికల్లో, ఓటు వేయవలసిందిగా ప్రతి భారతీయుని అభ్యర్ధిస్తూ, ఆర్ పి సంజీవ్ గోయింకా గ్రూప్ ద్వారా నెట్‌వర్క్ 18 చేపట్టిన ఇనిషియేటివ్. హాష్ ట్యాగ్ #ButtonDabaoDeshBanao ఉపయోగించి సోషల్ మీడియాలో సంభాషణను అనుసరించండి

news18-telugu
Updated: May 17, 2019, 7:18 PM IST
#ButtonDabaoDeshBanao : సార్వత్రిక ఎన్నికలు 2019.. మెరుగైన భారత్ కోసం ఓటు వేయండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతదేశంలో ప్రస్తుతం సాధారణ ఎన్నికలు 2019 జరుగుతున్నాయి. ఏడు దశల పోలింగ్‌లో ఆరవ దశ 2019 మే 12వ తేదీన నిర్వహించబడింది.భారతీయ పౌరులము మరియు ఓటర్లం అయిన మనం, ఎన్నికల సమయంలో పెద్ద పాత్ర పోషిస్తాము. దేశం నుదుటి రాతను రాయడంలో ప్రతీ పౌరుడి ఓటు పనిచేస్తుంది. భారతదేశ భవిష్యత్తు, పాలక రాజకీయ పార్టీలపై గాక దాని ఓటర్ల భుజాల మీద ఆధారపడి ఉంటుంది.ఓటు వేయడం ద్వారా దేశాన్ని బాగుచేసేందుకు పౌరుల జీవితాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేసే ఒక ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం అనేది ప్రతి వయోజన భారతీయుడి హక్కు మరియు బాధ్యత.

న్యూస్18 ఇండియా యొక్క అమిష్ దేవ్‌గన్ ఓటు విలువ గురించి చర్చిస్తారు. అతను మరియు సోనాల్ మ్యాన్సింగ్, సునీల్ అరోరా, దిలీప్ చేరియన్, అద్వైత కాల్రా మరియు శివాని వజీర్ పస్రిచా వంటి పలు రంగాలకు చెందిన ప్రఖ్యాత ప్రజా ప్రతినిధులు దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఓటు పాత్ర గురించి ప్రజలకు వివరిస్తారు.

ఓటు విలువ - విశ్లేషణ
ప్రతి భారతీయ పౌరుని ఓటు దేశం యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. తమ ఓటును వేయడం ప్రతి ఓటరుకు అవసరం మరియు తప్పనిసరి.
• వేయబడిన ప్రతి ఓటు పిల్లలకు విద్యను అందించడంలో సహాయపడుతుంది. ఇది మెయిన్ స్ట్రీమ్ విద్యకు ప్రాప్యత లేని 4% పిల్లలకు ప్రాధమిక విద్యను అందించడానికి వీలు కల్పిస్తుంది
• దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 50 మిలియన్ కు పైగా ప్రజల జీవితాలు ప్రయోజనం పొందుతాయి.
• మీ యొక్క ప్రతి ఓటు రోగులకు మరియు వ్యాధిగ్రస్తులకు మంచి వైద్య సంరక్షణ కోసం దారి తీస్తుంది.• నీరు, విద్యుత్ మరియు రహదారులు, గృహనిర్మాణం వంటి ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరచబడవచ్చు.
• మీ ఒక్క ఓటుకి ఆటని మార్చివేయగల మరియు ఎన్నికలను అటునుంచి ఇటు మళ్ళించగల శక్తి ఉంటుంది.
భారతదేశం వంటి ప్రజాస్వామ్యంలో ఓటరు అత్యంత బలమైన లింక్.

కొత్త మరియు మొదటిసారి ఓటర్లకు సలహా

కొత్త మరియు మొదటి-సారి ఓటర్లు వారి ఓటు రూపంలో గొప్ప శక్తిని వినియోగిస్తారు. వారి ఓటు వారి స్వరం మరియు వినిపించబడేలాగా వారు నిర్ధారించుకోవాలి.
చివరి నిమిషంలో గందరగోళాన్ని నివారించడానికి వారి పేరు ఓటర్ల జాబితాలో ఉన్నదా అని చూసి చెక్ చేసుకోవడానికి ఎంతో ముందుగానే ఆన్లైన్ వెళ్లవలసిందిగా, వారు అభ్యర్థించబడ్డారు.
వారి స్వంత ఊరు నుండి దూరంగా ఉండి మరియు పని లేదా చదువు కారణాల వల్ల దేశం యొక్క వివిధ ప్రాంతాలలో స్థిరపడిన ఓటర్లు వారి చిరునామాను మార్చుకోవటానికి మరియు వారి ప్రస్తుత నివాస స్థలంలో వారి ఓటు వేయడానికి విధానాన్ని తెలుసుకోవాలి
ఈ ఎన్నికల్లో హృదయపూర్వకంగా పాల్గొని, బాధ్యత గల పౌరులుగా వారి ఓటుని వేయాలని వారిని కోరడం జరుగుతోంది.

ఏ రాజకీయ నాయకుడికి లేదా రాజకీయ పార్టీకి ఓటు వేయాలనిపించకపోతే ఏమి చేయాలి?
ఎన్నోసార్లు ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులతో మరియు రాజకీయ పార్టీలతో ఓటరు నిరుత్సాహంగా ఉంటారు. ఆ సందర్భంలో మీకు మంచి స్ఫూర్తినిచ్చే మరియు మీకు మెరుగైన ప్రభుత్వపు ఆశను చూపే అభ్యర్థి మరియు పార్టీకి ఓటు వేయడం అనేది ఉత్తమమైన సలహా అంటారు సోనాల్ మాన్సింగ్. ప్రత్యామ్నాయంగా, మీరు దేశం ద్వారా ప్రేరణ పొందిన, ఒక గొప్ప దేశభక్తుడైన వ్యక్తిని కూడా గుర్తించవచ్చు. అటువంటి అభ్యర్థికి ఓటు వేయండి. పోలింగ్ కార్యకలాపాన్ని ఒక ఆరాధనగా భావించండి మరియు ఓటు వేయడానికి పూర్తి ఉత్సాహంతో హాజరవండి.

ఓటర్లకు సందేశం

ఉదాసీనత కోసం మీరు చెల్లించే వెల ఏమిటంటే ఒక ఉదాసీనంగా ఉండే ప్రభుత్వం. విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేయగల ఒక స్థిరమైన, బలమైన మరియు సామర్ధ్యం గల ప్రభుత్వానికి ఓటు వేయవలసిందిగా అద్వైత కాల్రా ప్రజలను అభ్యర్ధిస్తారు. ఓటింగ్ అనేది చాలా ఖరీదైన వ్యవహారం అని మరియు అది దేశ ఖజానా పై ఎంతో ఖర్చు అని గుర్తుంచుకోవలసిందిగా ఆమె ప్రజలను హెచ్చరిస్తారు.
మొత్తం ఆరు దశల్లో దశ 1 అత్యధిక ఓటు వేయడానికి వచ్చే ఓటర్లను నమోదు చేసింది. ఈ దశలో ఓటు వేయడానికి వచ్చినవారు 69.50% ఉన్నారు. దశ 2 లో అది 69.44%, దశ 3 లో అది 68.40% మరియు దశ 4లో అది 65.51% ఉంది. దశ 5 మరియు దశ 6 లోఓటు వేయడానికి వచ్చినవారు, వరుసగా 65% మరియు 63.48% ఉన్నారు.

బటన్ దబావో దేశ్ బనావో అనేది, ప్రస్తుతం జరుగుతున్న భారతీయ సాధారణ ఎన్నికల్లో, ఓటు వేయవలసిందిగా ప్రతి భారతీయుని అభ్యర్ధిస్తూ, ఆర్ పి సంజీవ్ గోయింకా గ్రూప్ ద్వారా నెట్‌వర్క్ 18 చేపట్టిన ఇనిషియేటివ్. హాష్ ట్యాగ్ #ButtonDabaoDeshBanao ఉపయోగించి సోషల్ మీడియాలో సంభాషణను అనుసరించండి.
First published: May 17, 2019, 7:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading