హైకమాండ్ నిర్ణయిస్తే ఢిల్లీలో ఆప్‌తో కలుస్తాం... షీలా దీక్షిత్ యూటర్న్... కారణాలేంటి

Lok Sabha Elections 2019 : ఢిల్లీలో ఆప్‌తో కలిసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపిస్తోంది. కేజ్రీవాల్ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తులుండవని ప్రకటించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 9:25 PM IST
హైకమాండ్ నిర్ణయిస్తే ఢిల్లీలో ఆప్‌తో కలుస్తాం... షీలా దీక్షిత్ యూటర్న్... కారణాలేంటి
షీలా దీక్షిత్ (File)
  • Share this:
Lok Sabha Elections 2019 : లోక్ సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో... పార్టీలన్నీ పొత్తుల ఎత్తుల్లో తలమునకలవుతున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై పెద్దగా ప్రజా వ్యతిరేకత లేదు. అందువల్ల ఆప్... లోక్ సభ ఎన్నికలపై ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉంది. అదే సమయంలో... కాంగ్రెస్ మాత్రం దేశవ్యాప్తంగా వీలైన అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ముందుకెళ్తోంది. అందులో భాగంగానే... ఢిల్లీలోనూ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ ప్రకటించారు. దీనిపై హైకమాండ్ ఆదేశిస్తే, తాము పాటిస్తామన్నారు. కొన్ని రోజుల ముందు ఇదే షీలా దీక్షిత్... తాము ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు మాట మార్చారు. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే... దాన్ని తాము శిరసా వహిస్తామన్నారు. దీని వెనక హైకమాండ్ నుంచీ వస్తున్న పాజిటివ్ సంకేతాలేనని తెలుస్తోంది. షీలా సహా చాలా మంది ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ఆప్‌తో పొత్తు ఇష్టం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం పొత్తుపా ఆశతో ఉంది. ఇటీవల పార్టీ అంతర్గతంగా జరిపిన సర్వేలో కూడా పొత్తుకు పాజిటివ్‌గా ఫలితాలొచ్చాయి. దీనిపై కొన్ని రోజుల్లోనే అధ్యక్షుడు రాహుల్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఆప్‌తో పొత్తు కుదిరితే... సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీలో మొత్తం 7 లోక్‌ సభ స్థానాలున్నాయి. మే 12న ఎన్నికలు జరగనున్నాయి. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏడు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని 1.36 కోట్ల మంది ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఆప్ కన్వీనర్ అరవింద కేజ్రీవాల్ మాత్రం తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవట్లేదని ప్రకటించారు. ఐతే... మోదీకి వ్యతిరేకంగా ఉన్న ఆయన... కాంగ్రెస్‌తో కలిసినా ఆశ్చర్యం అక్కర్లేదు.


పొత్తు కుదిరితే కాంగ్రెస్, ఆప్ చెరో మూడుస్థానాల్లో పోటీ చేసే అవకాశాలుంటాయి. మిగతా ఒక్క సీటులో రెండు పార్టీలకూ అనుకూలంగా ఉండే అభ్యర్థిని బరిలో దించే అవకాశాలున్నాయి. ఢిల్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ మిగతా రాష్ట్రాల అభ్యర్థులపై దృష్టి సారిస్తోంది.

 ఇవి కూడా చదవండి :

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చెయ్యాల్సిందే... హైకోర్టులో పిల్ దాఖలు

మీరు కాపలాదారు... నేను బేరోజ్‌గార్... ప్రధాని మోదీకి హార్దిక్ పటేల్ పవర్‌ఫుల్ కౌంటర్గెలిస్తే ఎమ్మెల్యే... ఓడితే ఎమ్మెల్సీ... అందుకే నారా లోకేష్ పదవికి రాజీనామా చెయ్యలేదా?

ఇక రైళ్ల ఆలస్యాలు ఉండవ్... 250 స్టేషన్ల దగ్గర త్వరలో రైల్వే ఫ్లై ఓవర్లు
First published: March 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు