ఎన్నికల వేళ మావోయిస్టుల ఘాతుకం..బీజేపీ ఎమ్మెల్యే సహా ఆరుగురు మృతి

బీజేపీ కాన్వాయ్‌లోని చివరి వాహనంలో ఎమ్మెల్యే భీమా మందావి ఉన్నారు. కాన్వాయ్‌ టార్గెట్‌గా ఐఈడీ బాంబులు పేల్చడంతో పాటు మావోయిస్టులు కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం.

news18-telugu
Updated: April 9, 2019, 6:38 PM IST
ఎన్నికల వేళ మావోయిస్టుల ఘాతుకం..బీజేపీ ఎమ్మెల్యే సహా ఆరుగురు మృతి
ధ్వంసమైన బీజేపీ కాన్వాయ్
  • Share this:
ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు.  తొలిదశ పోలింగ్‌కు ముందు దంతెవాడ అడవుల్లో రక్తపుటేరులు పారించారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న బీజేపీ కాన్వాయ్‌ లక్ష్యంగా మందుపాతర పేల్చారు. మావోయిస్టుల దాడిలో దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మందావి సహా ఆరుగురు పోలీసులు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. కౌకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామగిరి సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు 36 గంటల  ముందు ఈ ఘటన జరగడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.

బీజేపీ కాన్వాయ్‌లోని చివరి వాహనంలో ఎమ్మెల్యే భీమా మందావి ఉన్నారు. కాన్వాయ్‌ టార్గెట్‌గా ఐఈడీ బాంబులు పేల్చడంతో పాటు మావోయిస్టులు కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. ఘటన తర్వాత సీఆర్‌పీఎఫ్ బలగాలు చేరుకొని కూంబింగ్ చేపట్టారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీలో విపక్ష ఉపనేతగా ఉన్నారు భీమా. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత మహేంద్ర కర్మపై ఆయన విజయం సాధించారు. 2014లో సరిగ్గా ఇదే ప్రాంతంలో నక్సల్స్ దాడి జరిగింది. ఆ ఘటనలో ఏడుగురు చనిపోయారు.

First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు