హోమ్ /వార్తలు /జాతీయం /

ఎన్నికల ఫలితాలపై కొన్ని ఆసక్తికర విషయాలు... మీకోసం...

ఎన్నికల ఫలితాలపై కొన్ని ఆసక్తికర విషయాలు... మీకోసం...

ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లు

ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లు

Lok Sabha Election Results 2019 : ఓట్ల పండగ రోజున ఎలాగైతే మనం డిఫరెంట్‌గా ఫీలయ్యామో, ఎన్నికల ఫలితాల రోజున కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని ఆశ్చర్యపోదాం.

దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చేసరికి అర్థరాత్రి 12 దాటడం గ్యారెంటీ అంటున్నారు అధికారులు. ఐతే... అప్పటివరకూ మనం ఎవరు గెలుస్తారా అని ఎదురుచూడాల్సిన పని లేదు. ఎందుకంటే... ఆధిక్యతలను బట్టీ... ఎవరు గెలుస్తారో మనం ఓ అంచనాకు వచ్చేయవచ్చు. ఎప్పుడో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగితే... ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌ను మనం పరిశీలించాం. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11నే ఎన్నికలు అయిపోయినా... 42 రోజులపాటూ ఫలితాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తిన ఎన్నికల పోరులో విజేతలెవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.


కొన్ని ముఖ్యమైన అంశాలు :

* దేశవ్యాప్తంగా మొత్తం 542 లోక్‌సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి.

* ఉదయం 8 గంటలకు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

* ముందుగా అరగంటపాటూ పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు.

* ఆ తర్వాత సర్వీస్ ఓట్లు, ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు.

* ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికీ 5 పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్ల స్లిప్పులను కూడా లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

* వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించిన తర్వాతే విజేత ఎవరో ప్రకటిస్తారు.

* ముందుగా విజేత వివరాల్ని ఆన్‌లైన్‌లో ఈసీ వెబ్ సైట్‌లో ఎంటర్ చేసిన తర్వాతే అధికారికంగా ప్రకటిస్తారు.

* వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలి కాబట్టి... ఫలితాల వెల్లడికి ఎక్కువ టైం పడుతుంది.

* వీవీప్యాట్‌ స్లిప్పులను ఈవీఎం ఓట్లతో సరిపోల్చడం దేశంలో ఇదే మొదటిసారి.


కొన్ని ముఖ్యమైన పాయింట్లు :

* దేశవ్యాప్తంగా దాదాపు 10లక్షల 30వేల కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించారు.

* 20,600 కేంద్రాల్లో వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సి ఉంది.

* లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.11 శాతం పోలింగ్‌ నమోదైంది.

* ఇప్పటివరకు భారత పార్లమెంట్‌కు నమోదైన ఓటింగ్‌లో ఇదే అత్యధిక శాతం.

* మొత్తం 99 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పు ఇచ్చారు.

* పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారు 18 లక్షల మంది ఉద్యోగులు.

* 18 లక్షల మంది ఉద్యోగుల్లో 16.49 లక్షల మంది ఓటు వేశారు.

* పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు కొన్ని గంటలు పడుతుందని ఈసీ అనుకుంటోంది.

* వీవీప్యాట్‌ స్లిప్పులను చివర్లో లెక్కిస్తారు. పార్టీల వారీగా 25 స్లిప్పులు ఓ కట్టగా కడతారు.

* వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాక ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిచూస్తారు.

* రెండింటికీ మధ్య తేడా వస్తే వీవీప్యాట్‌ స్లిప్పులనే లెక్కలోకి తీసుకొని ఆ స్లిప్పులనే అసలైన ఓట్లుగా లెక్కిస్తారు.

* వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపునకు 5 గంటలు పడుతుందని ఎన్నికల సంఘం అంటోంది.


 


ఇవి కూడా చదవండి :


EVMలపై కంప్లైంట్లకు కంట్రోల్ రూం... ఇలా ఫిర్యాదు చెయ్యండి...


లగడపాటి కొత్తగా చెబుతున్నదేంటి... సర్వేపై తాజాగా ఏమన్నారంటే...


Election Results : కౌంటింగ్ టెన్షన్... ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ...


వైఎస్ జగన్‌కు Z కేటగిరీ భద్రత... ఎందుకో తెలుసా...

First published:

ఉత్తమ కథలు