కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు 527 లోక్సభ స్థానాలకు సంబంధించి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మరో 15 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో ధన ప్రవాహం కారణంగా తమిళనాడులోని వేలూరు లోక్సభ నియోజకవర్గ ఎన్నికను రద్దు చేశారు. మిగిలిన 542 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును గురువారం ఉదయం 8 గం.లకు ప్రారంభించారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి మళ్లీ అధికార పగ్గాలు కైవసం చేసుకుంది.
ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన 527 స్థానాలకు సంబంధించిన ఫలితాల్లో...298 స్థానాల్లో గెలిచిన బీజేపీ అగ్రస్థానంలో నిలుస్తోంది. 52 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా...23 స్థానాలతో డీఎంకే 22వ స్థానంలో నిలుస్తోంది. తృణాముల్ కాంగ్రెస్ 22, వైఎస్సార్ సీపీ 21, శివసేన 18, జేడీయు 16 స్థానాల్లో నిలిచాయి.
527 results have been declared of which 298 have gone to BJP, 52 to INC, 23 to DMK, 22 to AITC, 21 to YSR, 18 to Shiv Sena, 16 to JD(U), 9 to TRS & BSP, 6 to LJSP, 5 to SP & NCP, 3 to IUML&TD, 2 each to JKNC, SAD & rest to Others.
Take a look at #Assam.#ElectionResults2019pic.twitter.com/gAoGULwAoO
— Election Commission #DeshKaMahatyohar (@ECISVEEP) May 24, 2019
తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఏయే స్థానంలో ఏయే పార్టీ గెలిచిందో సూచించే చిత్రపటం..
తెలంగాణ ఎన్నికల ఫలితాలు(Election Commission/Twitter)
హర్యానాలో బీజేపీ క్లీన్ స్వీప్ సాధించింది. పదికి పది స్థానాలు సొంతం చేసుకున్న బీజేపీ.
మధ్యప్రదేశ్లో కమలకం వికసించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్కడ అధికారం కోల్పోయింది. అయితే ఐదు మాసాల్లోనే అక్కడ పరిస్థితి మారిపోయింది. మొత్తం 29 లోక్సభ స్థానాల్లో 28 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీని కేవలం ఒక్క స్థానానికి పరిమితం చేసింది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 27 స్థానాలు గెలుచుకోగా...కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.