నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..భారీ మెజార్టీ దిశగా ఎన్డీయే

Lok Sabha Election Results 2019: ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఎన్డీయే కూటమి రెండోసారి అధికార పగ్గాలు కైవసం చేసుకోనుంది. భారీ మెజార్టీ దిశగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఏపీలో వైసీపీ హవా కొనసాగుతోంది.

news18-telugu
Updated: May 23, 2019, 10:23 AM IST
నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..భారీ మెజార్టీ దిశగా ఎన్డీయే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. భారీ మెజార్టీ దిశగా బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పక్షాలు 340కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 288 స్థానాల్లో ముందంజలో ఉన్న ఎన్డీయే ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 276 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 93 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 54 స్థానాల్లో ముందంజలో నిలుస్తోంది.

ఏపీలో వైసీపీ హవా కొనసాగుతోంది. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ 18 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతోంది. ఫ్యాన్ స్పీడ్‌కు సైకిల్ చతికిలపడింది.

ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 11 స్థానాల్లో కారు జోరు కొనసాగుతోంది. కొన్ని స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి టీఆర్ఎస్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది.

పశ్చిమ బెంగాల్‌లో తృణాముల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. మొత్తం 42 స్థానాల్లో తృణాముల్ కాంగ్రెస్ 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా...బీజేపీ 17, కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతోంది. మొత్తం 80 స్థానాల్లో బీజేపీ 52, బీఎస్పీ 16, ఎస్పీ 9 స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతున్నాయి.

అటు ఒడిశాలో బీజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. బీజేడీ 11, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

తమిళనాట డీఎంకే కూటమి హవా కొనసాగుతోంది. ధన ప్రవాహం కారణంగా వేలూరు లోక్‌సభ ఎన్నిక రద్దుకాగా...మిగిలిన మొత్తం 38 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో డీఎంకే 22 స్థానాలు, కాంగ్రెస్ 8, సీపీఐ 2, సీపీఎం 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. అన్నాడీఎంకే కేవలం ఒక స్థానానికి పరిమితంకాగా...ఆ కూటమికి చెందిన పీఎంకే మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
First published: May 23, 2019, 10:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading