Lok Sabha Election 2019 Result: తమిళ నాడు ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ వెల వెల..

తమిళనాడులో జయ లలిత మరణం తర్వాత రాజకీయా పరిణామాలు మారాయి. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి అగ్ర నటులు రాజకీయాల్లో వస్తామంటూ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ ఆశించిన ఫలితాలను రాబట్టలేక పోయింది.

news18-telugu
Updated: May 23, 2019, 12:59 PM IST
Lok Sabha Election 2019 Result: తమిళ నాడు ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ వెల వెల..
కమల్ హాసన్ (File)
news18-telugu
Updated: May 23, 2019, 12:59 PM IST
తమిళనాడులో జయ లలిత మరణం తర్వాత రాజకీయా పరిణామాలు మారాయి. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి అగ్ర నటులు రాజకీయాల్లో వస్తామంటూ ప్రకటించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించినా.. ఈ లోక్‌సభ ఎన్నికల వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసారు. తమిళనాడులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో పార్టీని రెడీ చేస్తానంటూ ప్రకటించారు తలైవా. అదే సమయంలో కమల్ హాసన్ గతేడాది ఫిబ్రవరి 21న ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే పార్టీని స్థాపించాడు. దక్షిణాదిలో ఆరు రాష్ట్రాలకు గుర్తుగా ఆరు చేతులతో పార్టీ జెండాను తయారుచేసారు.అంతేకాదు ఈ ఎన్నికల్లో తమిళనాడులో దాదాపు అన్ని స్థానాల్లో తన పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టారు. ఎన్నికల సంఘం కమల్ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది. కానీ ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ ఒక్క స్థానంలో కూడా అసలు ప్రభావమే చూపించలేక పోవడాన్ని కమల్ హాసన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Lok Sabha Election Result 2019: kamal haasan party Makkal Needhi Maiam shows no effect in Tamil nadu lok sabha elections,kamal haasan,no effect in kamal haasan party in tamilnadu lok sabha Elections,makkal needhi maiam,kamal haasan,kamal,kamal hassan,kamal haasan speech,makkal needhi maiam party,tamil news,kamal speech,makkal needhi maiam latest news,kamal news,makkal needhi maiam kamal songs,people reactions on kamal's makkal needhi maiam,kamal latest speech,kamal haasan latest speech,maiam,makkal needhi maiam news,makkal needhi maiam flag,makkal needhi maiam songs,makkal needhi maiam candidate,election results 2019,live election result 2019,election results 2019 live,election result live today,2019 election results,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha election 2019 result,lok sabha election result,lok sabha election 2019 result live,election live results,election results,lok sabha election results 2019,election result 2019,lok sabha result,election 2019,లోకసభ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ వెల వెల,లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం,మక్కల్ నీది మయ్యమ్,ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిన కమల్ హాసన్,
కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్


కనీసం డీఎండీకే వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ రేంజ్‌లో కూడా కమల్ హాసన్ ఎన్నికల్లో మెరుపులు మెరిపించలేకపోయాడు. మొత్తానికి లోక్‌సభ ఎన్నికల ఫలతాల సరళిని బట్టి చూస్తే.. కమల్ హాసన్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నాయి. మొత్తానికి ఎంతో ఆర్భాటంగా రాజకీయ రంగంలో ప్రవేశించిన కమల్ హాసన్‌కు ఈ ఫలితాల సరళి మింగుడు పడటం లేదు.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...