Election 2019: ఈవీఎంలు మారుస్తున్నారన్న కథనాలు అవాస్తవం..ఈసీ స్పష్టీకరణ

Lok Sabha Election Result 2019 | స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరిచిన ఈవీఎంలను బయటకు తరలిస్తున్నట్లు వెలువడుతున్న కథనాలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

news18-telugu
Updated: May 21, 2019, 5:13 PM IST
Election 2019: ఈవీఎంలు మారుస్తున్నారన్న కథనాలు అవాస్తవం..ఈసీ స్పష్టీకరణ
కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం
news18-telugu
Updated: May 21, 2019, 5:13 PM IST
Lok Sabha Election Result 2019 | పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరిచిన ఈవీఎంలను మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ పుకార్లను నమ్మొద్దని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. స్ట్రాంగ్ రూమ్స్‌లోని ఈవీఎంలను మార్చే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని విపక్ష నేతలు పలువురు తమ పార్టీ శ్రేణులను కోరారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలను మారుస్తున్నారన్న కథనాల్లో వాస్తవం లేదని ఈసీ స్పష్టంచేసింది.

ఈవీఎంల తరలింపునకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు ఇప్పటివి కావని ఈసీ అధికారులు వివరణ ఇచ్చారు. పోలింగ్‌లో వినియోగించని ఈవీఎంలకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు స్పష్టంచేశారు. స్ట్రాంగ్ రూమ్స్‌లో ఈవీఎంలు అత్యంత బందోబస్తు మధ్య ఉన్నాయని, వాటి భద్రత విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని స్పష్టంచేశారు.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...