Lok Sabha Election Counting Results : వారణాసిలో 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విజయం సాధించారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షాలు 352 స్థానాల ఆధిక్యంలో ఉన్నాయి. వాటిలో బీజేపీ 302 స్థానాలు ఆధిక్యంలో ఉంది. అటు యూపీఏ పక్షాలు 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 49 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 101 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ రకంగా చూస్తే... మరోసారి బీజేపీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ తరపున మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచీ పోటీ చేసిన మన్నె శ్రీనివాస రెడ్డి గెలుపొందారు. మరో 7 లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ 4 లోక్ సభ స్థానాల్లో గెలుపొందింది. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. ఇక మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 6270 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచీ కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుపు సాధించారు.
ఏపీలో 22 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 3 చోట గెలుపు సాధించి మరో 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
AP Assembly Counting Results :ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 137, టీడీపీ 24 స్థానాల్లో... జనసేన 2 స్థానంలో ముందంజలో ఉన్నాయి. ఇప్పటివరకూ వైసీపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 1 స్థానంలో విజయం సాధించింది. కుప్పంలో 29,903 ఓట్ల తేడాతో చంద్రబాబు విజయం సాధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.