మొదలైన కౌంటింగ్... దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు...

Lok Sabha Election Counting 2019 : దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కి మూడంచెల భద్రత కల్పించారు. అందువల్ల కౌంటింగ్ ప్రశాంతంగా మొదలైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 7:58 AM IST
మొదలైన కౌంటింగ్... దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 7:58 AM IST
ముందుగా చెప్పినట్లే దేశవ్యాప్తంగా 20,600 కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల కౌంటింగ్ సరిగ్గా 8 గంటలకు మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ చేస్తున్నారు. 8.30కు సర్వీస్ ఓట్లు, ఈవీఎం ఓట్లను లెక్కించబోతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 542 లోక్ సభ స్థానాలు, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు, ఏపీలో 25 లోక్ సభ స్థానాలు, అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ మొదలైంది. అన్ని పార్టీల ఏజెంట్లూ... ముందుగానే కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు చేరుకున్నారు. వారి సమక్షంలోనే ఎన్నికల అధికారులు... కౌంటింగ్ ప్రారంభించారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా... ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజీలో కౌంటింగ్ కేంద్రం దగ్గర సరైన ఏర్పాట్లు చెయ్యలేదని ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ కూడా కీలకమైందే. ఎందుకంటే 2014లో జస్ట్ 10 ఓట్ల తేడాతో కూడా అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలున్నాయి. అందువల్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అత్యంత ప్రాధాన్య ఓట్లుగా భావిస్తూ ఏజెంట్లు కన్నార్పకుండా పరిశీలిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలు ఓట్ల కౌంటింగ్‌ను పరిశీలిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా, దాదాపు ఓ పండగలా ఫీలవుతున్నారు. ఇక బెట్టింగ్స్ కాసిన వారు సైతం... ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు గెలుస్తారు అన్న అంశాన్ని అత్యంత టెన్షన్‌తో చూస్తున్నారు. ఈసారి కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఉండటంతో... ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరుగుతోంది.

 ఇవి కూడా చదవండి :

టీడీపీ ఎన్నికల ఏజెంట్లకు ఆదేశాలు... చంద్రబాబు ఏమన్నారంటే...

ఇక సంబరాలే... టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు...
Loading...
మధ్యాహ్నానికి ఫలితం తెలిసిపోతుంది... ఏపీ ఈసీ ఏం చెప్పారంటే...

ఏపీలో తొలి ఫలితం నరసాపురం, మదనపల్లి నుంచే... ఎందుకంటే...
First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...