Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: April 16, 2019, 8:20 PM IST
ప్రతీకాత్మక చిత్రం
(సయ్యద్ అహ్మద్ - కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)
Your Parliament : 1967లో ఏర్పడిన పాండిచ్చేరి లోక్ సభ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 9 సార్లు గెలుపొందింది. కేవలం 4సార్లు మాత్రమే ప్రాంతీయ పార్టీలు గెలిచాయి. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్ తలోసారి పుదుచ్చేరిలో గెలిచాయి. పుదుచ్చేరి లోక్ సభ స్థానంలో 2009 వరకూ కాంగ్రెస్ పార్టీ హవాయే కొనసాగింది. గతంలో కాంగ్రెస్ కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు కానీ ఇక్కడ గెలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఎన్.రంగస్వామి కాంగ్రెస్) తొలిసారి ఈ స్థానంలో గెలుపొందింది. మాజీ సీఎం రంగస్వామి ఆధ్వర్యంలోని ఎన్.ఆర్.కాంగ్రెస్‌కు ఆయన నిజాయితీపరుడు, సామాన్యుడన్న మంచిపేరు కలిసి వస్తోంది.

రంగస్వామి
ఈసారి కూడా ఎన్.ఆర్.కాంగ్రెస్ పుదుచ్చేరి లోక్ సభ సీటు బరిలో నిలిచింది. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాధాకృష్ణన్‌కు బదులుగా నారాయణ స్వామిని బరిలోకి దించింది. గత ఎన్నికల్లో రాధాకృష్ణన్ ప్రస్తుత సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత వి.నారాయణస్వామిపై 60 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి నారాయణ స్వామి సీఎంగా ఉన్నందున ఎంపీగా బరిలోకి దిగలేదు. అలాగే ఎన్.ఆర్.కాంగ్రెస్ తరఫున కె.నారాయణ స్వామి రంగంలో ఉన్నారు. వీరిద్దరితో పాటు బీఎస్పీ, ఇతర పార్టీల నుంచి మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరికి తోడు మరో 8 మంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఈసారి పుదుచ్చేరి లోక్ సభ స్థానంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

వి.నారాయణస్వామి
ఇదివరకు ఫ్రెంచ్ దేశీయుల పాలనలో ఉన్న పుదుచ్చేరిలో ఇప్పటికీ ఆ ప్రభావం కనిపిస్తుంటుంది. ఇక్కడి స్కూళ్లలో ఫ్రెంచ్ రెండో బోధనా భాషగా ఉంది. ఇక్కడ ఫ్రెంచ్ నేర్చుకుని ఫ్రాన్స్‌లో స్థిరపడిన వారు లక్షల్లో ఉంటారు. ఇప్పటికీ ఫ్రెంచ్ హోటళ్లు, విద్యాసంస్థలు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఓవైపు ఏపీ, మరోవైపు తమిళనాడు, మరోవైపు కేరళ రాష్ట్రాలు పుదుచ్చేరికి సరిహద్దులుగా ఉన్నాయి. అందుకే ఈ మూడు రాష్ట్రాల ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ విశాలమైన సముద్ర తీరంతో పాటు బీచ్‌లు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఏటా ఇక్కడికి వేలాదిగా పర్యాటకులతో పాటు విదేశీ పక్షులు కూడా వలస వస్తుంటాయి.

ప్రతీకాత్మక చిత్రం
పుదుచ్చేరి నియోజకవర్గంలో మొత్తం 8 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో నాలుగున్నర లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే తెలుగు ఓటర్ల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే. పుదుచ్చేరి లోక్ సభ పరిధిలోకి వచ్చే యానాంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. పుదుచ్చేరి జనాభాలో 82 శాతం అక్షరాస్యులే కావడం, సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన ఓటర్లు ఉండటంతో రాజకీయ పార్టీలు అలవికాని హామీలు ఇచ్చేందుకు కూడా జంకే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. గతంలో కాంగ్రెస్‌ను ఆదరించిన ఓటర్లు... ఈ మధ్య ఎన్.ఆర్ కాంగ్రెస్ వైపు మళ్లడమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈసారి కూడా పుదుచ్చేరి లోక్ సభ స్థానంలో కాంగ్రెస్, ఎన్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంది.
ఇవి కూడా చదవండి :
ముస్లింలంతా కాంగ్రెస్‌కి ఓటు వేయాలి... సిద్ధూ వ్యాఖ్యలపై చర్యలకు బీజేపీ డిమాండ్...
దయచేసి అలాంటి వార్తలు ఇవ్వొద్దు... మీడియాకు తెలంగాణ సీఈసీ రజత్ కుమార్ వినతి
అంబటి రాయుడు త్రీడీ గ్లాసెస్ ట్వీట్... టీంఇండియా సెలెక్టర్లపై సెటైర్ వేసేశాడుగా...
తమిళనాడులో ఐటీ దాడులు... చంద్రబాబు టార్గెట్‌గా చేయించారా...
First published:
April 16, 2019, 8:20 PM IST