తెలుగు రాష్ట్రాలతోపాటు... దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ మొదలైంది. వీలైనంత త్వరగా ఓటు వేసేద్దామనే ఉద్దేశంతో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. ఐతే... మాక్ పోలింగ్ దశలోనే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. వీవీప్యాట్లలో స్లిప్లులు కూడా వెంటనే రావట్లేదు. బీప్ సౌండ్ కూడా కొన్ని చోట్ల సరిగా పనిచెయ్యట్లేదు. ఈ సమస్యల మధ్యే ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణలో సాయంత్రం 5 గంటలవరకూ పోలింగ్ జరగనుంది. ఒక్క నిజామాబాద్ లోక్ సభ స్థానానికి మాత్రం సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అక్కడ 185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు కాబట్టి... ఓ గంట అదనంగా కేటాయించారు.
ఏపీలో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవ్వగా... సాయంత్రం 6 గంటలవరకూ పోలింగ్ కొనసాగనుంది. వీవీప్యాట్లు తెచ్చిన కారణంగా... ఈసారి గంట అదనపు సమయం కేటాయించారు. అంతా బాగానే ఉన్నా... ఈవీఎంలు, వీవీప్యాట్లూ మొరాయించే సమస్య మాత్రం ఈసారీ కొనసాగుతుండటం తలనొప్పి అంశం. ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్న సమస్య కనిపిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే... పోలింగ్ ఈవెనింగ్ 6లోపు కంప్లీట్ అవ్వడం కష్టమంటున్నారు అధికారులు.
లోకసభ, పార్లమెంట్ సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి... ఎవరైనా ఫిర్యాదులు, సమస్యలు చెప్పాలనుకుంటే 24 గంటలూ పనిచేసేలా 08672-252176, 252377 ఫోన్ నంబర్లతో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.